Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే సంచ‌ల‌న నిర్ణ‌యం.. షిండేను పార్టీ నుంచి బహిష్కరణ 

By Rajesh KFirst Published Jul 2, 2022, 1:40 AM IST
Highlights

Maharashtra Politics: బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండేను పార్టీ అన్ని పదవుల నుంచి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు షిండేను తొలగించినట్లు శివసేన తెలిపింది. పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నందున షిండేపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Maharashtra Politics: మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. అనేక ట్విస్టుల మ‌ధ్య బీజేపీ మద్దతుతో ..శివ‌సేన రెబ‌ల్ నేత ఏక్నాథ్ షిండే ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ త‌రుణంలో మాజీ సీఎం, శివ‌సేన అధినేత‌ ఉద్ద‌వ్ ఠాక్రే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు శివసేన నుండి సీఎం ఏక్నాథ్ షిండేను తొల‌గించిన‌ట్టు ఉద్ధవ్ ఠాక్రే ప్ర‌క‌టించారు. పార్టీలో తిరుగుబాటు కార్యకలాపాలకు పాల్పడుతున్నారని షిండేకు రాసిన లేఖలో ఆరోపించారు. షిండే పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నందున‌. అత‌నిపై చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు.

శివసేన పార్టీ అధ్యక్షుడిగా త‌న‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి, పార్టీ నుంచి.. పార్టీ అనుబంధ సంస్థల‌ స‌భ్య‌త్వం నుండి షిండే ను తొలగిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఏక్‌నాథ్ షిండే  శివసేన పార్టీకి చెందిన‌ ముఖ్యమంత్రి కాదని ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. ఉద్ధవ్ ఠాక్రే శిబిరంలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
 
మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనపై మీడియా సీఎం షిండేను ప్రశ్నించగా.. తాను శివసేన, బీజేపీలకు ముఖ్యమంత్రిని అని అన్నారు. ప్రజల హృదయం ఉన్న ముఖ్యమంత్రిని. ఇప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడాలనుకోవడం లేదనీ, దీనిపై త్వ‌ర‌లో ఇంకా మాట్లాడతానని అన్నారు. 

170 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు 

జూలై 4న ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటామని చెప్పారు. షిండే మాట్లాడుతూ, “మాకు 170 మంది ఎమ్మెల్యేలు (బీజేపీతో సహా) ఉన్నారు. ఈ సంఖ్య మరింత‌ పెరుగుతోంది. అసెంబ్లీలో మాకు మెజారిటీ ఉంది. మహారాష్ట్ర ప్రయోజనాలను కాపాడే నిర్ణయాలు తీసుకుంటామ‌ని తెలిపారు.

నూత‌న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే.. మంత్రివ‌ర్గంతో భేటీ అయ్యారు. అనంత‌రం ముంబై మెట్రో కార్ షెడ్‌ను గ్రీన్ బెల్ట్ ఆఫ్ ఆరే కాలనీకి మార్చడానికి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ ప్ర‌భుత్వం మ‌హారాష్ట్ర‌ను అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లడానికి తోడ్ప‌డుతోంద‌ని అన్నారు. అయితే.. షిండే తీసుకున్న చర్యను ఉద్ద‌వ్ నిందించారు, ప్రధాన నిర్ణయాన్ని తిప్పికొట్టారు.

విలేఖరుల సమావేశంలో Maharashtra Politics ఉద్ధవ్ మాట్లాడుతూ.. గత పాలనలో రిజర్వు ఫారెస్ట్‌గా ప్రకటించబడిన సబర్బన్ గోరేగావ్‌లోని గ్రీన్ బెల్ట్ అయిన ఆరే కాలనీ వద్ద మెట్రో-3 కార్ షెడ్ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లవద్దని షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

"నేను చాలా బాధపడ్డాను. మీకు నాపై కోపం ఉంటే..  మీ కోపాన్ని బయట పెట్టండి, కానీ ముంబై గుండెల్లో గుచ్చకండి. ఆరే నిర్ణయం తోసిపుచ్చినందుకు నేను చాలా బాధపడ్డాను. ఇది వ్యక్తిగత ఆస్తి కాదు, అని ఉద్ధవ్‌ను ఉటంకించారు. సిఎం షిండే గా,  డిప్యూటీ సిఎం దేవేంద్ర‌ ఫడ్నవిస్ త‌మ‌ మొదటి క్యాబినెట్ సమావేశంలో.. కంజుర్ మార్గ్‌కు బదులుగా ఆరే కాలనీలో మెట్రో 3 కార్ షెడ్‌ను నిర్మించే ప్రతిపాదనను అమోదించారు.

click me!