ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోడీ భార్యను కలిసిన సీఎం మమత

By narsimha lodeFirst Published Sep 18, 2019, 11:42 AM IST
Highlights

ప్రధాని మోడీ సతీమణి యశోధాబెన్ ను బెంగాల్ సీఎం మమత బెనర్జీ కలిశారు. కోల్‌కత్తా ఎయిర్ పోర్టులో వీరిద్దరూ కొద్దిసేపు కలిసి మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది.

కోల్‌కత్తా:కోల్‌కత్తా ఎయిర్‌సోన్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సతీమణి యశోదాబెన్‌తో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి  మమత బెనర్జీ సోమవారం నాడు కలిశారు.

 మంగళవారం నాడు బెంగాల్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కళ్యాణేశ్వరీ  ఆలయంలో  యశోదాబెన్‌‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె పూజలు నిర్వహించినట్టుగా ప్రచారం సాగింది.

పూజలు నిర్వహించి యశోదాబెన్  ఢిల్లీకి వెళ్లే సమయంలో కోల్‌కత్తా ఎయిర్‌పోర్ట్‌లో  సీఎం మమత బెనర్జీ కలిశారు.  యశోదా బెన్ ను కలిసి మమత బెనర్జీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమయంలో మమత బెనర్జీ యశోదా బెన్ కు  ఓ చీరెను బహుమతిగా ఇచ్చినట్టుగా సమాచారం.

బెంగాల్ సీఎం మమత బెనర్జీ బుధవారం నాడు ప్రధానమంత్రి మోడీని  కలవనున్నారు.  రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని  మమత బెనర్జీ ప్రధాని మోడీని కోరనున్నారు.

click me!