ఒక్కటే ఎందుకు.. దేశానికి 4 రాజధానులు ఉండాలి : మమతా బెనర్జీ డిమాండ్..

By AN TeluguFirst Published Jan 23, 2021, 3:04 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశానికి నాలుగు రాజధానులు ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతోత్సవాల్లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశానికి నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలని మమతా బెనర్జీ అన్నారు. అప్పట్లో కోల్‌కతాను రాజధానిగా చేసుకుని ఆంగ్లేయులు ఏలారని, అలాంటప్పుడు దేశంలో ఒక్క రాజధాని నగరమే ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు. 

కోల్‌కతా సిటీలో బుధవారంనాడు జరిగిన టీఎంసీ భారీ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, నేతాజీని 'దేశ్‌నాయక్'గా రబీంద్రనాథ్ ఠాగూర్ సంబోధించారని, ఈ 'పరాక్రమ్' ఎక్కడదని ప్రశ్నించారు. నేతాజీ 125వ జయంత్యుత్సవాన్ని 'దేశ్ నాయక్ దివస్'గా ఈరోజు జరుపుకొంటున్నామని ప్రకటించారు.

ఇండియన్ నేషనల్ ఆర్మీని నేతాజీ స్థాపించినప్పుడు, గుజరాత్, బెంగాల్, తమిళనాడు ప్రజలతో సహా ప్రతి ఒక్కరిని అందులోకి తీసుకున్నారని మమతా బెనర్జీ తెలిపారు. బ్రిటిషర్ల విభజించు-పాలించు విధానానికి వ్యతిరేకంగా నేతాజీ పోరాటం సాగించారని అన్నారు.

'అజాద్ హింద్ స్మారకం మనం నిర్మించుకుందాం. ఎలా నిర్మించాలో చేసి చూపిద్దాం. వాళ్లు విగ్రహాలు, పార్లమెంటు కాంప్లెక్స్ నిర్మాణాలకు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు' అంటూ పరోక్షంగా కేంద్రంపై మమతా బెనర్జీ విరుచుకు పడ్డారు.
 
click me!