తల్లి ప్రియుడిని కిడ్నాప్ చేసిన 15యేళ్ల బాలుడు.. ఆ తరువాత...

Published : Jan 23, 2021, 01:37 PM IST
తల్లి ప్రియుడిని కిడ్నాప్ చేసిన 15యేళ్ల బాలుడు.. ఆ తరువాత...

సారాంశం

వివాహేతర సంబంధాలు పిల్లలమీద దారుణమైన ప్రభావాన్ని చూపుతాయి. వారిని క్రిమినల్స్ గా కూడా మారుస్తాయి. అలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తల్లి వివాహేతర సంబంధంతో  విసుగు పుట్టిన 15యేళ్ల అబ్బాయి నేరస్తుడిగా మారాడు. ఏకంగా తల్లి ప్రియుడినే కిడ్నాప్ చేసి పోలీసులకు దొరికిపోయాడు. 

మహారాష్ట్ర, నాగ్‌పూర్‌కి చెందిన బాలుడు మరో ఇద్దరు స్నేహితుల సాయంతో తన తల్లి ప్రియుడిని అపహరించి బైక్‌పై తీసుకెళ్లే క్రమంలో, బాధితుడు తప్పించుకోవడంతో విషయం వెలుగు చూసింది. 

వివరాల్లోకి వెళితే.. కాన్జీ హౌస్‌ చౌక్‌ ప్రాంతంలో నివాసముంటున్న బాలుడి తల్లి, ప్రదీప్‌ నందన్వర్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై ఆమె, ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో కలత చెందిన అబ్బాయి తన తల్లి ప్రియుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. దీనికోసం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నందన్వర్‌ కిడ్నాప్‌నకు కుట్ర పన్నాడు.

ఈ క్రమంలో ముగ్గురు యువకులు కలిసి నందన్వర్‌ పని చేసే ఆఫీసు నుంచి అతన్ని అపహరించి బైక్‌పై తీసుకెళ్తుండగా, ఓ ప్రాంతంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం కనపడటంతో నందన్వర్‌ రన్నింగ్‌ బైక్‌ నుంచి దూకేశాడు. పోలీసులను గమనించిన యువకులు నందన్వర్‌ను వదిలేసి పరారయ్యారు. 

నిందితుల నుంచి తప్పించుకున్న నందన్వర్‌ బాలుడి తల్లికి సమాచారం చేరవేసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరం అంగీకరించారు. ఆ ముగ్గురు యువకులకు ఎటువంటి క్రిమినల్‌ రికార్డ్‌ లేదని పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu
CPI-CPM Joint Press Conference: విజయ్ కు వామపక్షాల మద్దతుసీఎం కుర్చీ ఎక్కనున్న తలపతి| Asianet Telugu