Mamata Banerjee:  "ఎలాంటి ప‌రిస్థితిలోనూ అవినీతికి మద్దతు ఇవ్వ‌ను".. పార్థ ఛటర్జీ అరెస్టుపై మౌనం వీడిన మమతా 

Published : Jul 25, 2022, 06:21 PM IST
Mamata Banerjee:  "ఎలాంటి ప‌రిస్థితిలోనూ అవినీతికి మద్దతు ఇవ్వ‌ను".. పార్థ ఛటర్జీ అరెస్టుపై మౌనం వీడిన మమతా 

సారాంశం

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టు పై ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారిగా స్పందించారు. అవినీతికి, అక్రమాలకు తాను ఎలాంటి ప‌రిస్థితిలో మద్దతివ్వ‌బోన‌ని ఆమె అన్నారు.

Mamata Banerjee On Partha Chatterjee: పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారిగా స్పందించారు. అవినీతికి, అక్రమాలకు తాను ఎలాంటి ప‌రిస్థితిలో మద్దతివ్వ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. దోషులు ఎవ‌రైనా.. శిక్ష ప‌డాల‌ని అన్నారు. ఈ ఇలాంటి ప‌రిస్థితిలో త‌న‌ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పూర్తిగా  ఖండిస్తున్నాననీ, నిజం బయటకు రావాల‌ని అన్నారు.
  
పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై బెంగాల్ పరిశ్రమల మంత్రి పార్థ ఛటర్జీని శనివారం అరెస్టు చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది అక్రమ నియామకాల్లో ఆయన పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది .

ఈ త‌రుణంలో పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో సుమారు ₹ 20 కోట్ల నగదు ఈడీకి దొరికింది. ఈ కుంభ‌కోణం కేసులో మంత్రిని అరెస్టు చేశారు. ఈ స్కామ్ విష‌యంలో మంత్రికి, అర్పితా ముఖర్జీతో సంప్రదింపులు జరిపిన‌ట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఆమె ఇంట్లో దొరికిన నగదు  నేరపు ఆదాయం అని చెబుతోంది. అర్పితా ముఖర్జీ నివాసంపై ఈడీ శుక్రవారం దాడులు చేసింది.

 మంత్రి ఛటర్జీ అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రికి మూడు సార్లు కాల్స్ చేశాడు. కానీ, ముఖ్య‌మంత్రి నుంచి ఎలాంటి స్పంద‌న లేద‌నీ  "అరెస్ట్ మెమోలో ఈడీ వెల్లడించింది. కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి.. త‌న స‌మాచారాన్ని తెలియజేయాలనుకుంటున్న బంధువుల‌కు లేదా స్నేహితుల‌కు అవ‌కాశ‌ముంటుంది. ఈ స‌మ‌యంలో మంత్రి ఛ‌ట‌ర్జీ.. మమతా బెనర్జీకి ఫోన్ చేశార‌ట‌. 

 అరెస్టు చేసిన మ‌రుస‌టి రోజు  తెల్లవారుజామున 1.55 గంటలకు, తర్వాత తెల్లవారుజామున 2.33 గంటలకు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి ఫోన్ చేశారు. కానీ, సీఎం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు.అయినా.. మళ్లీ తెల్లవారుజామున 3.37, 9.35 గంటలకు ఫోన్ చేశారు. ఫలితం లేకపోకుండా పోయింది. 

అయితే..  తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈ విష‌యాన్ని తీవ్రంగా ఖండించింది. అరెస్టయిన మంత్రి  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ క‌స్ట‌డీలో ఉన్నందున సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేసే ప్రశ్నేలేద‌ని ఆ పార్టీ ఫిర్హాద్ హకీమ్ అన్నారు.

ఇదిలాఉంటే.. మంత్రి  ఛటర్జీ అసౌకర్యానికి గురైనందున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపిన వెంటనే ఆసుపత్రికి త‌ర‌లించారు. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి నుండి ఆయనను తరలించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టును ఆశ్రయించింది.  

కలకత్తా హైకోర్టు అతనిని AIIMS-భువనేశ్వర్‌కు తీసుకెళ్లాలని ఆదేశించిన తరువాత.. మంత్రి ఛటర్జీని సోమ‌వారం ఉదయం ఎయిర్ అంబులెన్స్‌లో ఒడిశాకు తరలించారు. అతను ఆరోగ్యంగా ఉన్నాడని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !