మల్లికార్జున ఖర్గేకు షాక్.. పరువు నష్టం కేసులో పంజాబ్ కోర్టు సమన్లు..

Published : May 15, 2023, 12:34 PM IST
మల్లికార్జున ఖర్గేకు షాక్..  పరువు నష్టం కేసులో పంజాబ్ కోర్టు సమన్లు..

సారాంశం

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్‌లోని సంగ్రూర్ కోర్టు సమన్లు జారీ చేసింది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్‌లోని సంగ్రూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. భజరంగ్‌దళ్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి  కోర్టు ఈరోజు ఖర్గేకు సమన్లు  జారీ చేసింది. ఇక, విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ హింద్ వ్యవస్థాపకుడు, సంగ్రూర్ నివాసి హితేష్ భరద్వాజ్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో భజరంగ్ దళ్‌ను సిమి, అల్ ఖైదా వంటి దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని తెలిపారు. 

హితేష్ భరద్వాజ్ ఫిర్యాదు మేరకు సంగ్రూర్ జిల్లా కోర్టు మల్లికార్జున ఖర్గేకు సమన్లు జారీ చేసింది. ఇక, కర్ణాటక ఎన్నికల సమయంలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే బజరంగ్ దళ్ వంటి సంస్థలపై నిర్ణయాత్మక చర్య తీసుకుంటామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇది వివాదానికి దారితీసిన సంగతి  తెలిసిందే. ఇది హిందూ దేవుడు హనుమంతుడిపై, ఆయన భక్తులపై జరిగిన దాడి అని బీజేపీ విమర్శలు గుప్పించింది. 
 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu