Sankranti 2022: ఫ్లాట్ ఫాం టికెట్ ధరలు పెంచేసిన రైల్వే శాఖ..!

By Ramya news teamFirst Published Jan 11, 2022, 1:27 PM IST
Highlights

ఈ నిర్ణ‌యంతో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో ప్లాట్ ఫాం టికెట్ ధ‌ర రూ. 50 అయింది. అయితే గ‌తంలో ప్లాట్ ఫాం ధ‌ర కేవ‌లం రూ. 10 మాత్ర‌మే ఉండేది.


సామాన్యులకు మరోసారి రైల్వే అధికారులు షాకిచ్చారు. మ‌రో సారి రైల్వే స్టేష‌న్ ల‌ల్లోని ప్లాట్ ఫాం టికెట్ ధ‌ర‌లు భారీగా పెరిగాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేష‌న్ ల‌లో ర‌ద్దీ ఎక్కువగా ఉంది. 

దీంతో దక్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు అ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యంతో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో ప్లాట్ ఫాం టికెట్ ధ‌ర రూ. 50 అయింది. అయితే గ‌తంలో ప్లాట్ ఫాం ధ‌ర కేవ‌లం రూ. 10 మాత్ర‌మే ఉండేది.

అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ కాకుండా.. ఇత‌ర స్టేష‌న్ ల‌లో రూ. 20 వ‌ర‌కు పెరిగింది. అయితే సంక్రాంతి పండుగ వ‌ల్ల పెరిగిన ర‌ద్దీని త‌గ్గించ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. పెంచిన ప్లాట్ ఫాం ధ‌రలు నేటి నుంచే అమ‌లులో ఉంటాయ‌ని అధికార‌లు తెలిపారు. అయితే పెంచిన ప్లాట్ ఫాం ధ‌ర‌లు ఈ నెల 20 వ‌ర‌కు ఉంటాయ‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు.

తాజా నిర్ణయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో ప్లాట్ ఫాం టికెట్ ధ‌ర రూ. 50 అయింది. గ‌తంలో ప్లాట్ ఫాం టికెట్‌ ధ‌ర కేవ‌లం రూ. 10 మాత్రమే ఉండేది.

కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ కాకుండా నాంపల్లి, కాచిగూడ, వరంగల్‌, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్‌, మహబూబ్‌నగర్‌, రామగుండం, మంచిర్యాల, భద్రాచలం, వికారాబాద్‌, తాండూర్, బీదర్‌, బేగంపేట తదితర స్టేషన్ల ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను రూ. 10 నుంచి రూ. 20 వ‌ర‌కు పెంచారు. కాగా సంక్రాంతి పండగ వ‌ల్ల రైల్వేస్టేషనల్లో పెరిగిన ర‌ద్దీని త‌గ్గించ‌డానికే ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. పెంచిన ప్లాట్ ఫాం ధ‌రలు నేటి నుంచే అమ‌లులో ఉంటాయ‌ని తెలిపారు. ఈ నెల 20 వ‌ర‌కు ఈ ధరలు ఉంటాయ‌ని రైల్వే అధికారులు తెలిపారు.

click me!