‘ మహా ’ ప్రభుత్వానికి సంబంధం లేదు: కంగనాకు తేల్చిచెప్పిన పవార్

By Siva KodatiFirst Published Sep 11, 2020, 6:27 PM IST
Highlights

కంగనా రనౌత్ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తూనే వుంది. కంగనాపై వచ్చిన డ్రగ్ ఆరోపణలపై నిగ్గుతేల్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీసులను కోరింది. 

కంగనా రనౌత్ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తూనే వుంది. కంగనాపై వచ్చిన డ్రగ్ ఆరోపణలపై నిగ్గుతేల్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీసులను కోరింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కంగనా వ్యవహారం ఆమెకు , రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సాగుతున్న వార్ కాబోదని ఆయన స్పష్టం చేశారు. కంగనా కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు వారి నిబంధనల ప్రకారం కూల్చివేశారని.. ఇది కార్పోరేషన్ నిర్ణయమని బీఎంసీ చెబుతోందని పవార్ అన్నారు.

Also Read:కంగనా వివాదం.. ప్రభాస్‌కి తలనొప్పిగా మారిందా?

దీనిపై సోనియా గాంధీ గురించి కంగనా ట్వీట్ చేస్తే తానేం చెప్పగలనని ఆమె ప్రశ్నించారు. ఇక కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసేముందు బీఎంసీ అధికారులు ఆమెకు సమయం ఇచ్చి వుండాల్సిందని మహారాష్ట్ర మంత్రి చుగన్ భుజ్ బల్ అన్నారు.

గతంలో హృతిక్ రోషన్‌పై పలు వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆయన మౌనం దాల్చడంతో ఆ వ్యవహారం సమసిపోయిందని చుగన్ గుర్తుచేశారు. బీఎంసీ కూడా హృతిక్‌ను చూసి నేర్చుకోవాలని సూచించారు.

కాగా మహిళను అవమానించారని ఆరోపిస్తూ కంగనా రనౌత్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై కర్ణిసేన, యూపీ మహిళా శక్తి అధ్యక్షురాలు శ్వేతా రాజ్ సింగ్ ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Also Read:కూలిన ఆఫీస్‌ చూసి కంగనా కన్నీళ్ళు.. ఉద్ధవ్‌ ఠాక్రేకి వార్నింగ్‌

సుశాంత్ మృతి కేసుకు సంబంధించి ముంబై పోలీసుల దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదంటూ సంజయ్ రౌత్ చేసిన  వ్యాఖ్యలతో వివాదం తారాస్థాయికి చేరింది.

నాటి నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. తాను ముంబైలో అడుగుపెడతానంటూ కంగనా అన్న మాటను నిలబెట్టుకున్నారు. ఆమె ముంబైలో అడుగుపెట్టడానికి కొద్ది క్షణాల ముందు కంగనా ఆఫీసును బీఎంసీ అధికారులు కూల్చివేయడంతో వివాదానికి ఆజ్యం పోసినట్లయ్యింది. 

click me!