Mahua Moitra: 65 ఏళ్ల వ్యక్తితో మహువా మోయిత్రా సీక్రెట్ పెళ్లి.. ఎవరీ పినాకీ మిశ్రా?

Published : Jun 05, 2025, 06:37 PM IST
mahua moitra marriage

సారాంశం

Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా, బిజు జనతాదళ్ (బీజేడీ) నేత పినాకీ మిశ్రా మే 3న జర్మనీలో వివాహం చేసుకున్నార‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. అయితే, అధికారికంగా ధృవీకరణ ఇంకా లేదు.

MP Mahua Moitra marries former BJD Pinaki Misra: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా, బీజూ జనతా దళ్ (బీజేడీ) మాజీ ఎంపీ పినాకీ మిశ్రాలు సీక్రెట్ గా వివాహం చేసుకున్నార‌ని వివిధ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. మే 3న జర్మనీలో ఈ ప్రైవేట్ వేడుక జరిగినట్టు సమాచారం.

దీనికి సంబంధించిన ఒక ఫోటో వైర‌ల్ గా మారింది. ఆ ఫోటోలో 50 ఏళ్ల మహువా మోయిత్రా, 65 ఏళ్ల పినాకీ మిశ్రాలు ఒకరిని ఒకరు చేయి పట్టుకుని నవ్వుతూ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇద్దరిలో ఎవ్వరూ ఈ పెళ్లిని అధికారికంగా ధృవీకరించలేదు.

 

 

పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుండి రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికైన మహువా, పార్లమెంటులో తన దూకుడైన ప్రసంగాలతో ప్రసిద్ధి చెందారు. ఆమెపై తన మొదటి ఎంపీ పదవీకాలంలో "ప్రశ్న అడగడానికై లంచం" కేసులో ఆరోపణలు రావటంతో ఆమె అర్హతను రద్దు చేశారు.

పినాకీ మిశ్రా ఎవ‌రు?

పినాకీ మిశ్రా, ఒడిశాలోని పూరీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించిన నిపుణుడైన రాజకీయ నాయకుడు. 1996లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. తరువాత బీజేడీలో చేరి 2009, 2014, 2019 ఎన్నికల్లో విజయవంతంగా ఎంపీగా కొనసాగారు.

ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి హిస్టరీలో BA (ఆనర్స్), అదే విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ లా నుంచి LLB పూర్తి చేశారు.

మహువా మోయిత్రా కొంతకాలం పాటు లార్స్ బొరోషన్ అనే డెన్మార్క్ పౌరుడితో వివాహ బంధంలో ఉన్నార‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ఈ వివాహం 2003 ప్రాంతంలో జరిగింది కానీ 2009లో విడాకులు తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. 2023లో సుప్రీంకోర్టు న్యాయవాది జయ్ అనంత్ దేవద్రాయితో సంబంధంలో ఉన్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ తర్వాత ఆ సంబంధం ముగిసినట్టు వార్తలు వచ్చాయి.

ఇది పినాకీ మిశ్రాకు కూడా రెండో పెళ్లే. ఆయన 1984లో సంగీత మిశ్రాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఒక కుమారుడు, కుమార్తె. పినాకీ కుమారుడి వివాహం రంజన్ భట్టాచార్య కుమార్తెతో జరిగింది. రంజన్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా భట్టాచార్య భర్త.

పినాకీ మిశ్రా రాజకీయానికి తోడు లీగల్ రంగంలో కూడా విశేష అనుభవం కలిగినవారు. ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా పని చేశారు. కార్పొరేట్ లా, మైనింగ్, ఎక్సైజ్, ఎన్విరాన్మెంట్ లా, భార‌త‌ చట్టాలు మొదలైన రంగాల్లో అనుభవం ఉంది. పలు పార్లమెంటరీ కమిటీల సభ్యునిగా సేవలందించారు.

ఈ వివాహ వార్త అధికారికంగా ధృవీకరించలేదు. సోషల్ మీడియాలో వారిద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే