సోషల్ మీడియాలో ధోని-సాక్షిల మధ్య సరదా సంభాషణ... వీడియో వైరల్

First Published 1, Sep 2018, 12:09 PM IST
Highlights

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏమాత్రం విరామం దొరికినా ప్యామిలీతో గడుపుతుంటారు.  తన భార్య సాక్షి, కూతురు జీవాలతోనే ఎక్కువ సమయం  గడుపుంతుంటారు.  ప్రస్తుతం మ్యాచ్ లేవీ లేకపోవడంతో ధోనీకి విరామం దొరికింది. దీంతో ఆయన తన కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి సిమ్లా కు వెళ్లారు. ఈ క్రమంలో విమానంలోని ఓ సరదా దృశ్యాన్ని వీడియోతీసిన సాక్షి తన ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
వారు ప్రయాణిస్తున్న విమానానికి భార్యా భర్తలు పైలట్లుగా వున్నారు. దీంతో వారిద్దరు విమానాన్ని కంట్రోల్ చేస్తుండగా సాక్షి వీడియో తీశారు. ఆ వీడియోకు సరదా కామెంట్ జతచేసి తన ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. '' మేం ప్రయాణిస్తున్న విమానానికి భార్యాభర్తలు పైలట్లుగా వున్నారు. వీరు ప్రయాణం మధ్యలో గొడవ పడొద్దని కోరుకుంటున్నా. ఈ రోజు భార్యే కెప్టెన్'' అంటూ సరదా కామెంట్ జతచేసింది.

ఈ వీడియోను చూసిన ధోనీ కూడా స్పందించారు. '' నీ పక్కన కూల్ హెలికాప్టర్ ఉంది. భయపడకు" అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

Last Updated 9, Sep 2018, 1:48 PM IST