యోగి ఆదిత్యానాథ్‌ను చెప్పుతో కొట్టాలన్నారు: ఉద్ధవ్‌పై నారాయణ్ రాణే ఆరోపణ

Published : Aug 25, 2021, 05:27 PM IST
యోగి ఆదిత్యానాథ్‌ను చెప్పుతో కొట్టాలన్నారు: ఉద్ధవ్‌పై నారాయణ్ రాణే ఆరోపణ

సారాంశం

కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మరోసారి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు కురిపించారు. గతంలో ఠాక్రే వివాదాస్పదంగా మాట్లాడారని గుర్తుచేశారు. ఓ సారి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను చెప్పులతో కొట్టాలన్నారని వివరించారు.

ముంబయి: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై నిప్పులు చెరిగారు. ఉద్ధవ్ ఠాక్రేపై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పునరుద్ఘాటించారు. సీఎం స్థానంలో ఉన్న ఒక వ్యక్తికి దేశ చరిత్ర గురించి అవగాహన లేకపోవడం సరైనదేనా అని అడిగారు. అంతేకాదు, ఉద్ధవ్ కూడా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. ఓ సారి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను పేర్కొంటూ ఆయనను చెప్పులతో కొట్టాలని అన్నారని గుర్తుచేశారు.

‘కొందరు నా మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారు. కానీ, నేనిప్పుడా విషయం మాట్లాడను. నా యాత్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో మొదలైంది. మోడీ ప్రభుత్వం ఏడేళ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రధాని మోడీ సూచనల మేరకు నా యాత్ర ప్రారంభించాను. కానీ, ఇందులో రెండు రోజుల విరామం వచ్చింది. ఎల్లుండి నుంచి పున:ప్రారంభిస్తాను. సింధుదుర్గ్‌ నుంచి మళ్లీ మొదలుపెడతాను’ అని బుధవారం నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌