పొంచి వున్న థర్డ్ వేవ్.. రెండో దశ చాలా నేర్పింది, అన్నింటికీ సిద్ధమే: ఉద్ధవ్ థాక్రే

By Siva KodatiFirst Published May 23, 2021, 8:38 PM IST
Highlights

రెండోదశ వ్యాప్తిలో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. థర్డ్ వేవ్ నేపథ్యంలో తాము ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే వెల్లడించారు. రెండోదశలో పడకలు, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిదని, ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుజాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకున్నామని ఆయన తెలిపారు. 

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. దీనిని అదుపు చేయడానికే ప్రభుత్వాలు కిందా మీదా పడుతున్న వేళ.. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం కూడా పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి దశలో వృద్ధులు, రెండో దశలో యువతపై ప్రభావం చూపిన వైరస్.. ఈసారి చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు.

రెండోదశ వ్యాప్తిలో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. థర్డ్ వేవ్ నేపథ్యంలో తాము ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే వెల్లడించారు. రెండోదశలో పడకలు, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిదని, ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుజాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకున్నామని ఆయన తెలిపారు.  

Also Read:ఇండియాలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

మరోవైపు దేశంలోనూ వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడిందని, రాష్ట్రానికి వ్యాక్సినేషన్‌ సరఫరాను బట్టి జూన్‌ నెలలో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ఉద్ధవ్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌పై పూర్తిస్థాయిలో పోరాడలేకపోయినప్పటికీ, కేసుల సంఖ్యను తగ్గించగలిగామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో వైరస్ అదుపులోనే వుందని సీఎం స్పష్టం చేశారు. అయితే థర్డ్ వేవ్‌లో పిల్లలపై వైరస్‌ ప్రభావం పడకుండా జాగ్రత్తపడాలని ఆయన రాష్ట్ర ప్రజలకు సూచించారు. వైరస్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని థాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 

click me!