మహా బిజెపిపై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Published : Nov 01, 2019, 04:32 PM IST
మహా బిజెపిపై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

శివసేనకు  చెందిన వారే మహారాష్ట్ర సీఎం అవుతారని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీకి సంఖ్యాబలం ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బలాన్ని నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. 


ముంబై: శివసేనకు చెందిన వ్యక్తే మహారాష్ట్ర సీఎం అవుతారని శివసేన అధికార ప్రతినిధి, ఆ  పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు.

శుక్రవారం నాడు సంజయ్‌రౌత్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇప్పటికైనా తలబిరుసును తగ్గించుకోవాలని శివసేన హెచ్చరించింది. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ తమను ఇంతవరకు సంప్రదించలేదని సంజయ్ రౌత్ చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకొంటే తమకు అవసరమైన ఎమ్మెల్యేలను కూడ సమకూర్చుకొంటామని కూడ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. 

బీజేపీకి సంఖ్యా బలం ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బలాన్ని నిరూపించుకోవాలని సంజయ్ రౌత్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు తమ భాగస్వామ్యానికని, ఫలితాలు వెల్లడైన రోజు నుంచి ఇప్పటి వరకూ బీజేపీ ఎందుకు చర్చలకు రావడం లేదని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.

మహారాష్ట్రలో డిప్యూటీ సీఎంతో పాటు 13 మంత్రి పదవులను ఇస్తామని  శివసేనకు బీజేపీ ఆఫర్ ఇచ్చింది. ముఖ్యమంత్రి పదవిపై 50:50 ఫార్మూలాను అనుసరించాలని  బీజేపీని శివసేన డిమాండ్ చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ బాస్‌గా నితిన్ నబిన్.. మోదీ, షా వేసిన ఈ మాస్టర్ స్కెచ్ వెనుక అసలు కథ ఇదే !
Tata Sierra : మీ దగ్గర రూ.2 లక్షలుంటే చాలు.. న్యూ టాటా సియెర్రా ఇంటికి తీసుకెళ్లండి