బెలూన్‌లో గాలిని నింపే సిలిండర్‌ పేలి.. రెండ్లేండ్ల‌ చిన్నారి మృతి

By Rajesh KFirst Published Aug 28, 2022, 1:09 PM IST
Highlights

బెలూన్‌లలో గాలిని నింపేందుకు ఉపయోగించే సిలిండర్‌ పేలి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తాతయ్యతో కలిసి బెలూన్లు కొనేందుకు వెళ్లిన రెండేళ్ల చిన్నారి ప్ర‌మాదశాత్తు ప్రాణాలు కోల్పోయింది. తాత మ‌న‌వ‌రాళ్లు జాత‌రకు వెళ్ల‌గా.. గాలిలో ఎగురుతున్న బెలూన్‌ని చూసి ఆ చిన్నారి తన తాతను కొనుక్కోవాలని కోరింది. ఆ తాత త‌న మ‌నవరాలు కోరిక‌ను కాద‌న‌లేక బెలూన్లు అమ్మే వ్య‌క్తి ద‌గ్గ‌ర‌కు తీసుకోవెళ్లాడు. అంతలోనే ప్ర‌మాద‌శాత్తువు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడులో ఆ చిన్నారితోస‌హా తాతకు తీవ్ర గాయాల‌య్యాయి. చిక్సిత పొందుతూ వారిద్ద‌రూ మర‌ణించారు.  ఈ ఘటన అమరావతి జిల్లా అచల్‌పూర్ తాలూకా షిండి బుద్రుక్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ కుటుంబ స‌భ్యులు షాక్‌కు గురయ్యారు. 
అదే సమయంలో ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. 

 
ఈ హృదయ విదారక సంఘటన గ్రామంలో పోలాల జాతర సందర్భంగా జరిగింది. పారి సాగర్ రోహి అనే రెండేళ్ల చిన్నారి తన తాతయ్యతో కలిసి పోలాల జాతరకు వెళ్లింది. ఈ జాతరలో బెలూన్ ఎగరడం చూసి తాతయ్యను తీసుకెళ్లి కొనేందుకు.. బెలూన్ అమ్మేవారి వద్దకు చేరుకోగా.. గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు చాలా తీవ్రంగా ఉంది, పారి తీవ్రంగా గాయపడింది. బాలిక శరీరం నుంచి కాలు, చేతులు విడిపోయాయి. తీవ్రంగా గాయపడిన పారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌లో ఆ చిన్నారి తాత‌య్య కూడా  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పేలుడు తీవ్రంగా ఉండడంతో ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ పేలుడుకు స‌మీపంలో ఉన్న కొన్ని ఇళ్లు కూడా స్వ‌ల్పంగా దెబ్బ‌తిన్నాయి.  అచల్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

click me!