షిర్డీ–కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ లో దొంగల బీభత్సం.. బెదిరించి 30 మంది మహిళల నుంచి బంగారం చోరీ

Published : Feb 20, 2023, 01:20 PM IST
షిర్డీ–కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ లో దొంగల బీభత్సం.. బెదిరించి 30 మంది మహిళల నుంచి బంగారం చోరీ

సారాంశం

Mumbai: పర్భణి రైల్వే స్టేషన్‌ శివారులో దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 30 మంది మ‌హిళ‌ల మెడ‌లోంచి బంగారు గోలుసుల‌ను చోరీ చేశారు. సిగ్న‌ల్ కోసం రైలు ఇక్క‌డ ఆగడంతో ఇదే అద‌నుగా దొంగ‌లు రెచ్చిపోయారు.   

Shirdi-Kakinada Express: మ‌హారాష్ట్రలోని ఒక రైల్వే స్టేషన్‌ శివారులో దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 30 మంది మ‌హిళ‌ల మెడ‌లోంచి బంగారు గోలుసుల‌ను చోరీ చేశారు. సిగ్న‌ల్ కోసం రైలు ఇక్క‌డ ఆగడంతో ఇదే అద‌నుగా దొంగ‌లు రెచ్చిపోయారు. రైల్వే పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు. 

రైల్వే పోలీసులు, బాధితులు వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. మహారాష్ట్రలోని పర్భణి స్టేషన్‌ శివారులో సిగ్నల్ కోసం షిర్డీ-కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. ఇదే అదనుగా భావించిన దుండగులు బోగీలోకి ప్రవేశించారు. ప్రయాణికులను బెదిరించి, మహిళ మెడలోని గొలుసులు కొట్టేశారు. S2 నుంచి S11 వరకు మహిళలే టార్గెట్‌గా దోపిడీ చేశారు. 30 మంది ప్రయాణికుల నుంచి బంగారం దోచుకెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పర్భణి స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌కు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకోవాలని కోరారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

టార్గెట్ 2035 .. ఈ రాష్ట్రంలో మురుగునీరే ఉండదట
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు