భారీ వ‌ర్షాల‌తో థానేలో కూలిన ఇళ్లు.. అహ్మదాబాద్-ముంబయి నేష‌న‌ల్ హైవే మూసివేత

Published : Jul 14, 2022, 01:22 PM IST
భారీ వ‌ర్షాల‌తో థానేలో కూలిన ఇళ్లు.. అహ్మదాబాద్-ముంబయి నేష‌న‌ల్ హైవే మూసివేత

సారాంశం

Heavy rainfall: భారతదేశం అంతటా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవ‌నాన్ని అస్తవ్యస్తంగా మార్చాయి. ప్రధాన నగరాల్లో నీటి ఎద్దడి కారణంగా రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం తదితర ఘటనలు అనేక మంది ప్రాణాలను బలిగొన్నాయి.  

Maharashtra rains: దేశ‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌హారాష్ట్రలో జోరు వాన‌ల‌తో అనేక చోట్ల వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. దీంతో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ‌తిన్నాయి. కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం తదితర ఘటనలు అనేక మంది ప్రాణాలను బలిగొన్నాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో గురువారం ఉదయం కురిసిన భారీ వర్షాల కారణంగా 50 ఏళ్ల మహిళ తన ఇంటి భాగం కూలిపోవడంతో గాయపడినట్లు పౌర అధికారులు తెలిపారు. ముంబ్రా టౌన్‌షిప్‌లోని రషీద్ కాంపౌండ్‌లోని చాల్ (టెన్మెంట్) వద్ద ఉదయం 5.30 గంటలకు ఈ సంఘటన జరిగిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం (RDMC) చీఫ్ అవినాష్ సావంత్ తెలిపారు. ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం కారణంగా మహిళ ఇంటి గోడలో కొంత భాగం కూలిపోయిందని ఆయన చెప్పారు.

మహారాష్ట్రలోని భండారా జిల్లాలో 15 మందిని రక్షించారు..

భండారా జిల్లాలోని తుమ్సర్‌లో గురువారం నాడు 15 మందిని SDRF బృందం రక్షించింది. అక్కడ వరదలు రావడంతో ఆలయంలో వారు ఇరుక్కుపోయారు. 

మహారాష్ట్రలో 22 మంది ట్రక్కు డ్రైవర్లను సుర‌క్షితంగా.. 

మహారాష్ట్రలో గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో చంద్రాపూర్ జిల్లా పోలీసుల బృందం 22 మంది ట్రక్కు డ్రైవర్లను రక్షించింది. వార్ధా నది ఉద్ధృతి కారణంగా గడ్‌చందూర్-ధనోరా హైవే ముంపునకు గురవడంతో వారు అక్క‌డ ఇరుక్కుపోయారు. అలాగే, పాల్ఘర్‌లోని వైతర‌ణి నదిలో జిఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్మికులు చిక్కుకున్నారు. NDRF బృందం, పాల్ఘర్ తహసీల్దార్ నుండి అభ్యర్థనను స్వీకరించి, రెస్క్యూ ఆప‌రేష‌న్ నిర్వ‌హించివ వారిని ర‌క్షించారు. మొత్తం 10 మంది కార్మికులను అక్క‌డి నుంచి సుర‌క్షితంగా ర‌క్షించామ‌ని NDRF బృందాలు తెలిపాయి. 

మహారాష్ట్రలో భారీ వర్షం హెచ్చరిక

రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ హెచ్చ‌రించింది. ముంబ‌యి న‌గ‌రంలో.. వివిక్త ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, అప్పుడప్పుడు బలమైన గాలులు గంటకు 45- నుంచి 60 కిలో మీట‌ర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందనీ, ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు హెచ్చ‌రించారు. 

అహ్మదాబాద్‌-ముంబ‌యి జాతీయ ర‌హ‌దారి మూత‌.. 

రాష్ట్రంలో ఇప్ప‌టికీ భారీ వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే అహ్మదాబాద్‌-ముంబ‌యి జాతీయ ర‌హ‌దారిని అధికారులు మూసివేశారు. పెరుగుతున్న నీటి మట్టాలు & భద్రతను దృష్టిలో ఉంచుకుని, అహ్మదాబాద్ నుండి ముంబ‌యి వరకు నేష‌న‌ల్ హైవే మూసివేశామ‌ని అధికారులు తెలిపారు. నీటిమట్టం తగ్గిన వెంటనే హైవేను తెరుస్తామ‌ని డీఎం అమిత్‌ ప్రకాశ్‌ యాదవ్ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM