మహారాష్ట్రలో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: శరద్ పవార్ ధీమా

By Nagaraju penumala  |  First Published Nov 25, 2019, 11:40 AM IST

తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించినట్లు శరద్ పవార్ తెలిపారు. తమ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 170మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉందని తెలియజేస్తూ వారి మద్దతుతో కూడిన లేఖలను గవర్నర్ కార్యాయలంలో అందజేశారు. 
 


మహారాష్ట్ర: మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లో తమ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఎన్సీపీ చీలిక వర్గం తోడ్పాటుతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం చేశారని ఆమన ఆరోపించారు. 

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం బీజేపీకి లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుతీరుతుందని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి సహకరించిన పార్టీ నేత అజిత్‌ పవార్‌పై వేటును శరద్‌ పవార్‌ సమర్ధించుకున్నారు. ఇది ఏ ఒక్క​ వ్యక్తీ తీసుకున్న నిర్ణయం కాదని, ఇది పార్టీ నిర్ణయమని తేల్చి చెప్పారు.

Latest Videos

మహారాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్ నిరసన: లోక్‌సభలో రాహుల్, బయట సోనియా

ఎన్సీపీ పార్టీ క్రమశిక్షణను అజిత్ పవార్ ధిక్కరించారని శరద్ పవార్ ఆరోపించారు. అందువల్లే ఆయనపై వేటు వేయక తప్పలేదన్నారు. బీజేపీకి అజిత్ పవార్ మద్దతు పలకడం అనేది  ఆయన వ్యక్తిగత నిర్ణయమన్నారు. పార్టీ తరపున ఏ వ్యక్తీ నిర్ణయం తీసుకోలేరని స్పష్టం చేశారు. 

మరోవైపు తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించినట్లు శరద్ పవార్ తెలిపారు. తమ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 170మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉందని తెలియజేస్తూ వారి మద్దతుతో కూడిన లేఖలను గవర్నర్ కార్యాయలంలో అందజేశారు. 

 

click me!