సీఎం పదవి పోయింది కానీ రికార్డు మిగిలింది: మహాపాలిటిక్స్ పై నెటిజన్లు

By Nagaraju penumalaFirst Published Nov 28, 2019, 5:36 PM IST
Highlights

సీఎం పదవి అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కోల్పోయారు గానీ ఆయన పేరిట ఓ అరుదైన రికార్డు మాత్రం సృష్టించారు. మహారాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ కాలం పాటు సీఎం పదవిలో ఉన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 

ముంబై: మహారాష్ట్ర రాజకీయం సంక్షోభానికి ఎట్టకేలకు ముగింపు పలికింది. అనేక మలుపులు తిరిగిన మహాపాలిటిక్స్ కు నేటితో తెరపడనుంది. ముఖ్యమంత్రి పదవిని అటు బీజేపీ ఇటు శివసేన, మరోవైపు ఎన్సీపీ పార్టీల ఊరిస్తూ చివరికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ను వరించింది. 

అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు మహా వికాస్ అఘాది పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకుంది కూటమి. 

ఇలాంటి తరుణంలో ట్విస్ట్ ఇచ్చారు దేవేంద్ర ఫడ్నవీస్. ఎన్సీపీలో చీలిక తెచ్చారు. శరద్ పవార్ సోదరుడు అజిత్ పవార్ ను తనవైపునకు తిప్పుకుని గవర్నర్ ను కలవడం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం బాధ్యతలు కూడా స్వీకరించడం ఆగమేఘాల మీద జరిగిపోయాయి. 

అయితే మహారాష్ట్ర సీఎం పీఠంపై కన్నేసిన మహావికాస్ అఘాది కూటమి తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావడంతో సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది దేవేంద్ర ఫడ్నవీస్ కి. 

సీఎం పదవి అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కోల్పోయారు గానీ ఆయన పేరిట ఓ అరుదైన రికార్డు మాత్రం సృష్టించారు. మహారాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ కాలం పాటు సీఎం పదవిలో ఉన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 

నవంబర్ 23న సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ నవంబర్ 26న తన పదవికి రాజీనామా చేశారు. అంటే కేవలం మూడున్నర రోజుల పాటు మాత్రమే మహారాష్ట్ర కు సీఎం గా వ్యహరించారు దేవేంద్ర ఫడ్నవీస్. 

మహారాష్ట్ర చరిత్రలో మూడున్నర రోజులపాటు అతి తక్కువ రోజులు సీఎంగా వ్యవహరించిన వ్యక్తిగా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. ఫడ్నవీస్ కంటే ముందు పీకే సావంత్‌ పేరున ఈ రికార్డు ఉంది. ఈయన కేవలం 9 రోజుల పాటు మహారాష్ట్ర సీఎం గా కొనసాగిన సంగతి తెలిసిందే.   

1963లోకాంగ్రెస్ పార్టీ సీఎంగా కేవలం 9 రోజులపాటు పనిచేశారు. ఆయన రికార్డును దేవేంద్ర ఫడ్నవీస్ తిరగరాశారు. కేవలం మూడున్నర రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసి మహారాష్ట్ర చరిత్రలో తనకంటూ ఒక కొత్త చరిత్ర సృష్టించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మూడున్నర రోజుల ముఖ్యమంత్రి.. ఫడ్నవీస్ రికార్డ్

click me!