NITI Aayog CEO: NITI ఆయోగ్ నూత‌న‌ CEO గా పరమేశ్వరన్ అయ్యర్.. ఇంత‌కీ అత‌ని బ్యాక్ రౌండేంటీ?

By Rajesh KFirst Published Jun 24, 2022, 11:25 PM IST
Highlights

NITI Aayog CEO: నీతి ఆయోగ్ (NITI Aayog ) నూత‌న‌ సీఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ పరమేశ్వరన్ అయ్యర్ (Parameswaran Iyer) నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవో గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ అమితాబ్ కాంత్ ప‌ద‌వీ కాలం ఈ నెల 30న ముగియ‌నున్న‌ది. ఆయ‌న‌ స్థానంలో అయ్యర్ ప‌దవీ బాధ్యతలు చేపడతారు
 

NITI Aayog CEO: నీతి ఆయోగ్ (NITI Aayog ) నూత‌న‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మాజీ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్‌ (Parameswaran Iyer)ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సీఈవో గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ అమితాబ్ కాంత్ ప‌ద‌వీ కాలం ఈ నెల 30న ముగియ‌నున్న‌ది. ఆయ‌న‌ స్థానంలో అయ్యర్ ప‌దవీ బాధ్యతలు చేపడతారు. రెండేళ్లు లేదా, తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఆయన పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. జూన్ 2021లో కాంత్ పదవీకాలం ముగిసింది. కానీ అత‌ని ప‌ద‌వీకాలాన్ని ఒక ఏడాది పాటు కేంద్రం పొడిగించింది. 1980 కేరళ కేడర్‌కు చెందిన అమితాబ్ కాంత్ 2016 నుంచి నీతి ఆయోగ్ సీఈవోగా కొనసాగుతున్నారు.  

ఇదిలా ఉంటే.. గతంలో తాగునీరు, పారిశుధ్య కార్యదర్శిగా పనిచేసిన పరమేశ్వరన్ అయ్యర్ గతేడాది జూలైలో తన పదవికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, సుప్రసిద్ధ పారిశుధ్య నిపుణుడు అయ్యర్‌ను నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రెండేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు (ఏదైనా ముందుగా) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. . డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) నోటిఫికేషన్ ప్రకారం.. కాంత్‌కు వర్తించే అదే నిబంధనలు మరియు షరతులపై అయ్యర్‌ని నియమించారు.

పరమేశ్వరన్ అయ్యర్ (Parameswaran Iyer) ఎవరు?

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1981 ఐఏఎస్ అధికారి అయిన అయ్యర్‌కు పారిశుద్ధ్య స్పెషలిస్ట్‌గా కూడా మంచిపేరుంది.  2009లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) నుంచి అయ్యర్ రిటైర్ అయ్యారు. 2016లో డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ (డీఓడీడబ్ల్యూఎస్) శాఖ కార్యదర్శిగా తిరిగి వచ్చారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌కు స్ఫూర్తిగా నిలిచారు. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1981 ఐఏఎస్ అధికారి అయిన అయ్యర్‌ (Parameswaran Iyer) కు పారిశుద్ధ్య స్పెషలిస్ట్‌గా కూడా మంచిపేరుంది. ఆయ‌న 2009లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. అయ్యర్ ఐక్యరాజ్యసమితిలో సీనియర్ గ్రామీణ నీటి శానిటేషన్ స్పెషలిస్ట్‌గా కూడా పనిచేశారు. 2016లో డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ (డీఓడీడబ్ల్యూఎస్) శాఖ కార్యదర్శిగా తిరిగి వచ్చారు. ఆయ‌న స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తిగా నిలిచారు. ఆయన హయాంలో దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు. 2020, జూలై లో డీఓ‌డీ‌డబ్ల్యూఎస్ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.  ఆ తర్వాత USలోని వరల్డ్ బ్యాంకుతో కలిసి పనిచేసేందుకు అమెరికా వెళ్లారు. యూపీలో మాయావతి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో కూడా అయ్యర్ పనిచేశారు.

ప్రధాని మోదీ ప్రశంసలు

ప్రధాని మోదీ.. పరమేశ్వరన్ అయ్యర్‌ (Parameswaran Iyer) ను ప‌లు సంద‌ర్బాల్లో ప్ర‌శంసించారు. ప్ర‌ధాని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పరమేశ్వరన్ అయ్యర్ స్వయంగా వెళ్లి టాయిలెట్‌ను శుభ్రం చేస్తారని అన్నారు. ఈ రోజు మనం బాపు (మహాత్మా గాంధీ) కలలను నెరవేరుస్తామనే నమ్మకం పరమేశ్వర అయ్యర్ వంటి అధికారుల వల్ల మాత్రమే సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. 

click me!