Ketaki Chitale: శరద్ పవార్‌పై అభ్యంతరకర పోస్ట్ చేసిన‌ మరాఠీ నటి విడుద‌ల‌.. మీడియా ముందు సైలెంట్‌

Published : Jun 23, 2022, 11:01 PM IST
Ketaki Chitale: శరద్ పవార్‌పై అభ్యంతరకర పోస్ట్ చేసిన‌ మరాఠీ నటి విడుద‌ల‌.. మీడియా ముందు సైలెంట్‌

సారాంశం

Marathi actor Ketaki Chitale: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్‌(Sharad Pawar) పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్‌కి సంబంధించి అరెస్టయిన మరాఠీ నటి కేత్కీ చితాలే (Ketki Chitale) గురువారం జైలు నుంచి విడుదలయ్యారు.  

Marathi actor Ketaki Chitale: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్‌(Sharad Pawar) పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు అరెస్టయిన మరాఠీ నటి కేత్కీ చితాలే (Ketki Chitale) గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే.. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేత్కీ మీడియాతో పెద్దగా మాట్లాడలేదు. చాలా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. జై హింద్ జై మహారాష్ట్ర అంటూ వెళ్లిపోయారు. తాను ఇప్పుడు ఏం మాట్లాడ‌లేన‌ని.. సమయం వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతానని అన్నారు. 

మరాఠీ నటి కేత్కి చితాలే గ‌త రెండు వారాల క్రితం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో శరద్‌ పవార్‌కు వ్యతిరేకంగా పోస్టు చేసింది.  ఇందులో ‘నరకం ఎదురు చూస్తున్నది, బ్రాహ్మణ ద్వేషి’ అంటూ పలు అభ్యంతరకర పోస్టులు చేసింది. అయితే.. ఆ నటి మరాఠీలో చేసిన ఈ పోస్టుల్లో ఎక్క‌డ కూడా శరద్‌ పవార్ పేరు పూర్తిగా ప్రస్తావించలేదు. కానీ, పవార్‌, 80 ఏళ్ల వ్యక్తి అని పరోక్షంగా శ‌ర‌ద్ ప‌వార్ ను ఆరోపణ‌లు గుప్పించింది. నెట్టింట్లో ఈ పోస్ట్ వైర‌ల్ కావ‌డంతో తొలుత‌ థానేలోని కాల్వా పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోదైంది. దీంతో పాటు మరో రెండు పోలీస్‌ స్టేషన్లలో నటి కేత్కి చితాలేకు వ్యతిరేకంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్ర‌మంలో న‌టి కేత్కీ చితాలేను జూన్ 1 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టు ఆదేశించింది.  

అంతకుముందు.. శరద్ పవార్ గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ చేసినందుకు మరాఠీ నటి కేత్కి చితాలే అరెస్ట్‌కు వ్యతిరేకంగా జాతీయ మహిళా కమిషన్ (NCW) కూడా విచారణ నిర్వహించింది.  పోలీసులు రాజకీయ ప్రతీకార ప్రాతిపదికన వ్యవహరించకూడదని అన్నారు. మహారాష్ట్ర పోలీస్ చీఫ్ తరపున స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) మిలింద్ భరాంబే కమిషన్ ముందు హాజరయ్యారు. 

ఈ వ్యవహారంపై ఎన్‌సిడబ్ల్యు ప్రెసిడెంట్ రేఖా శర్మ విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ఎఫ్‌ఐఆర్‌లో పరువునష్టం కేసు ఎందుకు పెట్టారు ? ఫిర్యాదుదారు ఎవరనే విషయమై వివరణ కోరినట్లు కమిషన్ తెలిపింది. ఇది మాత్రమే కాదు, ఇంతకుముందు చాలా మంది పోస్ట్‌ను షేర్ చేసినప్పటికీ కేత్కిపై మాత్రమే ఎందుకు చర్య తీసుకున్నారు? అరెస్టు చేయడానికి ముందు సరైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించారా? అని కూడా మిలింద్ భరాంబే అడిగారు.

పోలీస్ స్టేషన్ వెలుపల కెట్కీపై దాడి చేసిన మహిళా ఎన్‌సిపి నాయకులపై పోలీసులు తీసుకున్న చర్యలను, ఈ సెక్షన్‌ను ఇప్పటికే ఉన్నత న్యాయస్థానం ఆమోదించినప్పటికీ, ఈ కేసులో ఐటి చట్టంలోని సెక్షన్ 66A ఎందుకు ప్రయోగించబడిందో తెలుసుకోవాలని NCW కోరింది. అనేక ఇతర కేసుల్లో మహారాష్ట్ర పోలీసులు ప్రారంభించిన చర్యల గురించి కూడా కమిషన్ భరాంబేని ప్రశ్నించింది. 

రాజకీయ ప్రతీకారం 

కమీషన్ ఒక ప్రకటనలో, “CrPC యొక్క సెక్షన్ 41A ప్రకారం.. పోలీసులు అరెస్టు చేయడానికి ముందు నిందితులకు నోటీసు ఇవ్వాలి. నాన్-కాగ్నిజబుల్ కేసులలో మేజిస్ట్రేట్ ముందస్తు అనుమతి తీసుకోవాలి. అయితే, చట్టంలోని ఈ తప్పనిసరి నిబంధనను పాటించడంలో పోలీసులు విఫలమయ్యారు. తదుపరి చర్య వరకు విషయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటన పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం