మహారాష్ట్రలో కరోనా విజృంభణ: 9566 మంది పోలీసులకు కోవిడ్, 103 మంది మృతి

Published : Aug 02, 2020, 06:16 PM IST
మహారాష్ట్రలో కరోనా విజృంభణ: 9566 మంది పోలీసులకు కోవిడ్, 103 మంది మృతి

సారాంశం

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని 9566 మందికి కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో 103 మంది పోలీసులు మరణించారు.


ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని 9566 మందికి కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో 103 మంది పోలీసులు మరణించారు.

కరోనా సోకిన పోలీసుల్లో 7534 మంది కోలుకొన్నారు.1929 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 4 లక్షల 31వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 15,316 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 

also read:తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కి కరోనా

మహారాష్ట్రలో మార్చి నుండి ఇప్పటివరకు 2,19, 975 కేసులను 188 సెక్షన్ కింద నమోదయ్యాయి. కరోనా నిబంధనలకు విరుద్దంగా  వ్యవహరించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

దేశంలో కరోనా కేసులు 17,50,724 దాటాయి. దేశంలో 5,67,730 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సోకి 11,45,630 మంది కోలుకొన్నారు. కరోనాతో దేశంలో 
37,364 మంది మరణించారు. 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కు కూడ కరోనా సోకింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులను నిరోధించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలను ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలో కరోనా రోగుల రికవరీ రేటు పెరిగింది. 
 

PREV
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100 వేలు..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే