నన్ను ఎవరు చూడర్లే అనుకున్నాడు.. ఏకంగా సీఎం చూశారు

Siva Kodati |  
Published : Jun 11, 2019, 05:45 PM ISTUpdated : Jun 11, 2019, 05:46 PM IST
నన్ను ఎవరు చూడర్లే అనుకున్నాడు.. ఏకంగా సీఎం చూశారు

సారాంశం

బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే తెలిసిన వారో.. లేదంటే చుట్టుపక్కల వారో మనల్ని మందలిస్తూ ఉంటారు అలాంటిది ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మందలిస్తే. 

బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే తెలిసిన వారో.. లేదంటే చుట్టుపక్కల వారో మనల్ని మందలిస్తూ ఉంటారు అలాంటిది ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మందలిస్తే. వివరాల్లోకి వెళితే... గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు తన వాహనంలో వెళ్తున్నారు.

ఈ సమయంలో స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి  కంభార్జువా నదిలో చెత్తపారేయటం ముఖ్యమంత్రి గమనించారు. అంతే వెంటనే తన కాన్వాయ్‌ని ఆపించి... నదిలో చెత్తను పారేయవద్దని సదరు వ్యక్తిని మందలించారు.

నదుల్ని కలుషితం చేయొద్దని.. బాధ్యతగల పౌరుడిగా ప్రవర్తించాలని సూచించారు. ఈ తతంగాన్ని సావంత్ తన ట్వీట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆయనను ప్రశంసించారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !