దారిలోకి రాని మహమ్మారి: లాక్‌డౌన్ వైపే ఉద్ధవ్ మొగ్గు.. రాత్రికి అధికారిక ప్రకటన

By Siva KodatiFirst Published Apr 13, 2021, 4:57 PM IST
Highlights

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ మహమ్మారి అదుపులోకి రాకపోవడంతో మహారాష్ట్ర సర్కార్.. సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా నిర్ణయం తీసుకుంది

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ మహమ్మారి అదుపులోకి రాకపోవడంతో మహారాష్ట్ర సర్కార్.. సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా నిర్ణయం తీసుకుంది.

దీనిలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 30 వరకు మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించే అవకాశం వుంది. ఈ రాత్రికి అధికారికంగా ప్రకటన చేయనున్నారు సీఎం ఉద్థవ్ థాక్రే. ఇప్పటికే అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేశారు ఉద్ధవ్ థాక్రే. 

కాగా, లాక్‌డౌన్‌పై సీఎం ఉద్ధవ్ థాక్రే సందిగ్థంలో పడ్డారు. లాక్‌డౌన్ ఎన్ని రోజులు పెట్టాలన్న దానిపై టాస్క్‌ఫోర్స్‌తో ముఖ్యమంత్రి చర్యలు జరుపుతున్నారు. రోజు రోజుకి కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో 15 రోజులు లాక్‌డౌన్ పెట్టాలని సూచించింది టాస్క్‌ఫోర్స్.

Also Read:గుడ్‌న్యూస్: విదేశీ వ్యాక్సిన్లకు అనుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

అయితే అన్ని రోజులు లాక్‌డౌన్‌కు ప్రభుత్వం విముఖంగా వున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో పతిరోజూ 50 వేల కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటికే వారంతపు లాక్‌డౌన్ విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. 

లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే పేదలు, రోజువారీ కార్మికులు, కూలీల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కరోనా కారణంగా ప్రభావితమవుతున్న వర్గాలను ఆదుకునేందుకు ఉద్దేశించిన ఆర్థిక ప్యాకేజీపై చర్చించేందుకు సోమవారం సమావేశం ఏర్పాటుచేశారు.

click me!