మహారాష్ట్ర సర్కార్ కు ఎలాంటి ముప్పు లేదు: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

Published : Jun 21, 2022, 02:41 PM ISTUpdated : Jun 21, 2022, 02:46 PM IST
మహారాష్ట్ర సర్కార్ కు ఎలాంటి ముప్పు లేదు: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

సారాంశం

ఏక్‌పాథ్ షిండే వ్యవహారం శివసేన అంతర్గత సమస్య అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చెప్పారు.శివసేన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాము ఆ పార్టీతోనే ఉంటామని  ఆయన చెప్పారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన తేల్చి చెప్పారు.

న్యూఢిల్లీ: తాను సీఎం కావాలని ఏక్‌నాథ్ షిండే ఎప్పుడూ కూడా చెప్పలేదని ఎన్సీపీ Sharad Pawar చెప్పారు.  Eknath Shinde వ్యవహరం Shiv Sena అంతర్గత సమస్యగా  శరద్ పవార్ చెప్పారు.  శివసేన ఏ నిర్ణయం తీసుకున్నా తాము శివసేనతో కలిసి నడుస్తామన్నారు.

 ప్రభుత్వంలో మార్పు అవసరం లేదని తాము భావిస్తున్నామని శరద్ పవార్ చెప్పారు. మంగళవారం నాడు NCP  చీఫ్ శరద్ పవార్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని శరద్ పవార్ తేల్చి చెప్పారు. శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం Uddhav Thackeray పై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. 

ఈ సంక్షోభానికి శివసేన పరిష్కారం కనుగొంటుందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సజావుగా నడుస్తుందన్నారు. మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ సిండే నేతృత్వంలో సుమారు 21 మంది ఎమ్మెల్యేలు గుజరాత్ రాష్ట్రంలో  హోటల్ లో సమావేశమయ్యారని వార్తలు వెలువడిన నేపథ్యంలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.  

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల కూటమి తరపున అభ్యర్ధిని బరిలోకి దింపేందుకు ఢిల్లీలో ఉన్న శదర్ పవార్ ఇవాళ రాత్రికి ముంబైలో ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం కానున్నారు.  మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. అలా జరగనివ్వబోమని ఆయన చెప్పారు.

ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత కొంత మంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయారని తెలిసింది. ముఖ్యంగా థానేలో మాస్ లీడర్‌గా ఉన్న ప్రస్తుత రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే  తనతోపాటు 21 మంది శివసేన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్‌కు వెళ్లారని మీడియా కథనాలు చెబుున్నాయి.. సూరత్‌లోని ఓ హోటల్‌లో మకాం వేసినట్టు తెలుస్తున్నది. వారికి గుజరాత్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్టు కథనాలు వచ్చాయి. అంతేకాదు, ఈ శివసేన ఎమ్మెల్యేలు అక్కడి బీజేపీ నేతలకు టచ్‌లో ఉన్నారని తెలిసింది.

ఏక్‌నాథ్ షిండే ముంబయిలో లేరని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ధ్రువీకరించారు. కానీ, వారిని తాము సంప్రదించగలిగామని వివరించారు. ఏక్‌నాథ్ షిండేను ఉపయోగించి తమ ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నాలు సఫలం కావని అన్నారు. షిండే తమ పార్టీకి విశ్వసనీయమైన నేత అని వివరించారు. తమతోపాటు చాలా ఆందోళనల్లో ఆయన పాలుపంచుకున్నారని వివరించారు. ఆయన బాలాసాహెబ్ సైనికుడు అని చెప్పారు. అసలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే కన్ఫ్యూజన్‌లో ఉన్నారని పేర్కొన్నారు.  వారు తిరిగి రాకుండా బీజేపీ అడ్డుకుంటున్నదని అన్నారు. ఇ సోమవారం రాత్రి తమ ఎమ్మెల్యేలు కాంటాక్టులో లేరన్నది నిజమేనని, కానీ, ఇప్పుడు వారిలో చాలా మందిని తాము సంప్రదించగలిగామని వివరించారు.

also read:మహారాష్ట్రలో త్వరలో ఫడ్నవీస్‌ నేతృత్వంలో ప్రభుత్వం వస్తుంది: బీజేపీ ఎమ్మెల్యే శివేంద్రరాజే సంచలన కామెంట్స్

మహారాష్ట్రలో అధికార కూటమి మహా వికాస్ అఘాడీ లో పొరపొచ్చాలు వచ్చి ఐక్యత సన్నగిల్లినట్టు రాజ్యసభ ఎన్నికల ఫలితాలతో చాలా మంది అనుమానాలు వచ్చాయి. బీజేపీ అనుకున్నదాని కన్నా ఎక్కువ సీట్లు రాబట్టగలిగింది. శివసేనకే ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ తర్వాత తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ శివసేన భంగపడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో 10 స్థానాల్లో ఐదింటిని బీజేపీ సునాయసంగా గెలుచుకుంది. 

PREV
click me!

Recommended Stories

టార్గెట్ 2035 .. ఈ రాష్ట్రంలో మురుగునీరే ఉండదట
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు