కెమికల్ కంపెనీలో  భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

Published : Oct 27, 2022, 12:49 AM ISTUpdated : Oct 27, 2022, 12:51 AM IST
కెమికల్ కంపెనీలో  భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

సారాంశం

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బైసర్ ఎంఐడీసీ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చాలా మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.  

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బోయిసర్ పట్టణంలోని తారాపూర్ ఎంఐడీసీ ప్రాంతంలోని ఓ రసాయన కర్మాగారంలో బుధవారం బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించారు. 12 మంది  కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న బోయిసర్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది, స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. వస్త్ర పరిశ్రమలో ఉపయోగించే గామా యాసిడ్‌ను ఉత్పత్తి చేసే యూనిట్‌లో సాయంత్రం 4:20 గంటలకు ఈ సంఘటన జరిగింది. పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 18 మంది కార్మికులు పనిచేస్తున్నారని బోయిసర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కస్బే తెలిపారు. ప్రాథమిక విచారణలో రియాక్టర్ పాత్రలో ఒత్తిడి కారణంగానే పేలుడు సంభవించినట్లు ప్లాంట్ ఇన్‌చార్జి నిర్ధారించారని ఆయన చెప్పారు.పేలుడు చాలా తీవ్రంగా ఉందని, ప్లాంట్ పైకప్పు పేలిపోయిందని  తెలిపారు.కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పాత్రలో పేలుడు సంభవించడంతో ముగ్గురు కార్మికులు మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని తెలిపారు.

మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. బాయిలర్ లో సోడియం సల్ఫేట్‌ను అమ్మోనియాతో కలిపే ప్రక్రియ జరుగుతుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసు డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్ అధికారుల నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటామని ఆయన చెప్పారు.

సోషల్ మీడియాలో రూ.18.5 లక్షల మోసం

మరోవైపు, ఫేస్‌బుక్‌లో గుర్తుతెలియని సోషల్ మీడియా వినియోగదారులు  ఒక మహిళ నుంచి రూ.18.51 లక్షలను దోచుకున్నారని థానే సిటీ పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో బాధిత మహిళకు ఒక పురుషుడు, ఓ మహిళ  నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. వారిద్దరూ లండన్‌లో ఉన్న న్యూరో సర్జన్లు అని పేర్కొన్నారు.

ఆ ఇద్దరూ వారితో స్నేహంగా నటించి.. బాధిత మహిళ నుంచి.. మొత్తం రూ.18,51,221 నగదు దోచుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు..  ఆగస్టు,సెప్టెంబర్‌లో  వారికి చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.18,51,221 జమ చేసింది. మంగళవారం థానే నగరంలోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 420 (చీటింగ్) మరియు 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద కేసు నమోదు చేయబడిందని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu