
మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ముంబైలోని రెండు వంతెనలకు పేర్లు మార్చింది. వెర్సోవా-బాంద్రా సీ లింక్ బ్రిడ్జికి ‘‘ వీర్ సావర్కర్ సేతు ’’ అని , ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ వంతెనకు ‘‘ అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మృతి నవ సేవ అటల్ సేతు’’ అని పేరు పెట్టింది. ఈ వంతెన పేర్లు మార్పుపై గతంలోనే సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటన చేశారు. వీర్ సావర్కర్ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ వారిపై పోరాడారు. ఈ క్రమంలో ఆయనకు 50 ఏళ్లు జైలు శిక్ష విధించిన తెల్ల ప్రభుత్వం.. అండమాన్ నికోబార్‌లోని కాలాపానీ సెల్యులార్ జైలులో నిర్భందించింది. ఇక అటల్ బిహారీ వాజ్‌పేయ్ భారతదేశానికి ప్రధానిగా సేవలదించారు.
కాగా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాటలోనే నడుస్తున్నారు.నగరాల పేరు మార్చేందుకు పనిలో పడ్డారు. ఇప్పటికే ఔరంగాబాద్ పేరును ‘ఛత్రపతి శంభాజీ నగర్’గా, ఉస్మానాబాద్ నగరానికి ‘ధరాశివ్’గా పేరు మార్చిన విషయం తెలిసిందే. తాజాగా.. మరో నగరం పేరు మార్చుతున్నట్టు సీఎం ఏకనాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. ఇటీవల అహ్మద్ నగరలో జరిగి ఓ కార్యక్రమంలో ఏక్‌నాథ్ షిండే ప్రసంగిస్తూ.. అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యాదేవి హోల్కర్‌గా మార్చబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ALso Read: Ahmednagar: మరో నగరం పేరు మార్చనున్న మహారాష్ట్ర సర్కార్.. ఇంతకీ ఆ నగరమేంటీ..?
అహల్యాదేవి హోల్కర్ ఇంటిపేరు షిండే అని, నేను కూడా షిండే అని వేదికపై ముఖ్యమంత్రి అన్నారు. మీ అందరి డిమాండ్ ను, అహల్యాదేవి హోల్కర్ ను ఆదర్శంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అందుకే అహ్మద్‌నగర్ పేరును 'అహల్యానగర్'గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనీ, తమ హయాంలోనే పేరు మార్పు నిర్ణయం తీసుకోవడం అదృష్టమని షిండే అన్నారు. పేరు మార్చడం ద్వారా నగర ప్రతిష్ట మరింతపెరుగుతుందన్నారు.
అహల్యాబాయి హోల్కర్ ఎవరో తెలుసా?
అహల్యాదేవి హోల్కర్ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో 1725వ సంవత్సరంలో జన్మించారు. మాల్వా రాజ్యానికి ఆమెగా వ్యవహరించారు. అహల్యాదేవికి చిన్నప్పటి నుంచి ప్రజలకు సహాయం చేయాలనే తపన ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే (1733) ఖండేరావుతో వివాహమైంది. అయితే 1754 సంవత్సరంలో ఖండేరావు యుద్ధంలో వీరమరణం పొందారు. ఆ తర్వాత అహల్యాదేవిని హోల్కర్‌కు సామ్రాజ్యాధిపత్యం అప్పగించారు. అహల్యాదేవి హోల్కర్ భారతదేశ చరిత్రలో అత్యుత్తమ రాణులలో ఒకరిగా పరిగణించబడుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక ధర్మశాలలను నిర్మించిన ఘనత అహల్యా బాయి హోల్కర్‌కు దక్కుతుంది. ఆమె 1795 ఆగస్టు 13న తుది శ్వాస విడిచాడు.