
ముంబై: తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని మహారాష్ట్ర సీఎం నిర్ణయం తీసుకొన్నారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు.
తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని హోంమంత్రి సీఎం ఉద్దవ్ ఠాక్రేకు రెండు రోజుల క్రితం లేఖ రాశారు. దీంతో ఈ అంశంపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం నిర్ణయం తీసుకొన్నారని ఆదివారం నాడు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు.
ముంబై మాజీ కమిషనర్ పరంబీర్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం నిర్ణయం తీసుకొన్నారన్నారు.
ముంబైలోని పలు బార్లు, రెస్టారెంట్ల నుండి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని పోలీసులకు హోంమంత్రి ఆదేశించారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ విషయమై పరమ్‌బీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది.
సుప్రీం సూచన మేరకు మాజీ పోలీస్ కమిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.