
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఐదు నెలల క్రితం రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. అప్పటి మహా వికాస్ అఘాదీ ప్రభుత్వం కూలిపోయింది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో శివసేన ఎమ్మెల్యేలు ప్రభుత్వం పై తిరుగుబాటు చేయడంతో సర్కారు కూలిపోయింది. సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏక్‌నాథ్ షిండే సీఎం, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పడు ఈ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం చేసిన కామాఖ్యా అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి ఏక్‌నాథ్ షిండే, మరో 39 ఎమ్మెల్యేలు అసోంకు వెళ్లుతున్నారు. కామాఖ్య అమ్మవారు తమ మొక్కు తీర్చినందుకు మొక్కు అప్పజెప్పుకోవడానికి నవంబర్ 21న సీఎం ఏక్‌నాథ్ షిండే, 39 మంది ఎమ్మెల్యేలు నవంబర్ 21న వెళ్లుతున్నారు.
ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినప్పుడు ఏక్‌నాథ్ షిండే, ఆయన ఎమ్మెల్యేలు తొలుత గుజరాత్‌లోని సూరత్, ఆ తర్వాత అక్కడి నుంచి అసోంలోని గువహతికి వెళ్లిపోయారు. గువహతిలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. అప్పుడే వారు గువహతిలోని కామాఖ్యా దేవి మందిరానికి వెళ్లారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు జరిగేలా చూడాలని కామాఖ్యా అమ్మవారికి మొక్కుకున్నారు.
Also Read: శివసేనలో చీలికకు నేను, నా తండ్రి ఉద్ధవ్ ఠాక్రే బాధ్యులం: ఆదిత్యా ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు తాము గువహతిలో ఉన్నామని, కామాఖ్య దేవి మందిరానికి వెళ్లామని ఏక్‌నాథ్ షిండే క్యాంప్ ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే తాజాగా తెలిపారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే రావాలని అప్పుడే తాము మొక్కామని వివరించారు. తామంతా అక్కడ కలిసి ఉన్నందుకు సంతోషపడ్డామని తెలిపారు. తాము అనుకున్నట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని విశ్వాసంగా ఉన్నామని చెప్పారు. ఈ మొక్కు తీర్చినందుకు అమ్మవారికి కృతజ్ఞతగా పూజ చేయాలని భావిస్తున్నట్టు వివరించారు.
మెల్లగా ఎంపీలు కూడా ఉద్ధవ్ ఠాక్రే క్యాంప్ నుంచి శివసేన వైపు వెళ్లారు. మొత్తం 19 ఎంపీల్లో 13 మంది ఎంపీలు ఏక్‌నాథ్ షిండే క్యాంపులోకి వెళ్లారు. అయితే, వీరు అసోంకు వెళ్లడం లేదు. అసోం కామాఖ్యా టెంపుల్ పర్యటనకు వీరికి ఆహ్వానం అందలేదని తెలుస్తున్నది.