వివాహ వేడుకకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..

Published : Aug 14, 2022, 12:02 PM IST
వివాహ వేడుకకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..

సారాంశం

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు. కారులో ఉన్నవారు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మంజర్సుంబ-పటోడా హైవేపై తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కేజ్ తహసీల్‌లోని జివాచివాడి గ్రామానికి చెందిన ఒక కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో పుణెకు బయలుదేరారు. అయితే వారి వాహనం, టెంపో ఒకదానికొకటి ఢీకొన్నాయి. 

ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు, మరో వ్యక్తి మృతిచెందాడని పోలీసులు తెలిపారు. రెండు వాహనాలు వేరు చేసి, రోడ్డుపై నుంచి తొలగించేందుకు క్రేన్‌ను ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.  

PREV
click me!

Recommended Stories

Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !