కుంభమేళాలో దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు... అన్నీ ఉచితమే

Published : Feb 05, 2025, 11:28 PM IST
కుంభమేళాలో దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు... అన్నీ ఉచితమే

సారాంశం

మహాకుంభ్ 2025లో నారాయణ సేవా సంస్థ ద్వారా దివ్యాంగులకు ట్రైసైకిల్, కృత్రిమ అవయవాలు, వీల్‌చైర్‌లు వంటివి ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాకుండా, భోజనం, వసతి, పవిత్ర స్నానం వంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.  

kumbhmela 2025 : ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 మానవ కల్యాణానికి వేదికగా మారింది. ఈ మేళా ప్రాంతంలో ప్రతిరోజూ అన్నదానం, భక్తులకు వసతి, దుప్పట్లు పంపిణీతో పాటు దివ్యాంగులకు వివిధ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఉదయ్‌పూర్‌కు చెందిన నారాయణ సేవా సంస్థ పేద వికలాంగులకు అవసరమైన సేవలు చేస్తోంది. ఇలా దివ్యాంగులకు ట్రైసైకిల్స్, వీల్‌చైర్స్ తో పాటు ఉన్నత నాణ్యత కలిగిన కృత్రిమ అవయవాలను ఉచితంగా అందిస్తున్నారు. సంగమంలో పవిత్ర స్నానం, భోజనం, వసతి వంటి ఏర్పాట్లను కూడా సంస్థ చేస్తోంది.

సెక్టార్ 18లో స్వామి అవధేశానంద గిరి శిబిరానికి ఎదురుగా ఉన్న నారాయణ సేవా సంస్థ శిబిరంలో మానవ సేవ చేస్తున్నారు. కుంభమేళాలో ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా దివ్యాంగులకు దాదాపు 50 ట్రైసైకిల్స్, 150 కంటే ఎక్కువ కృత్రిమ అవయవాలు పంపిణీ చేయబడ్డాయి. భక్తులకు భాగవతం, రామకథ వంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ... ఉన్నత నాణ్యత కలిగిన కృత్రిమ అవయవాలు దివ్యాంగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇవి మార్కెట్లో చాలా ఖరీదైనవని, కానీ మహాకుంభ్ ప్రాంతంలో అవసరంలో ఉన్న దివ్యాంగులకు వీటిని ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 70 మంది సభ్యుల బృందం ద్వారా వివిధ జనకల్యాణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు.

45 రోజుల్లో వేలాది మంది భక్తులకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యం

నారాయణ సేవా సంస్థ మకర సంక్రాంతి జనవరి 14 నుండి మహాకుంభ్‌లో అన్నదానం, దుస్తులు, దుప్పట్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా వందలాది మందికి ఉచిత వసతి కల్పిస్తోంది. సంస్థ ద్వారా వేలాది మందికి గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో పవిత్ర స్నానం చేసే అవకాశం కల్పించబడింది. మహాకుంభ్ కాలంలో వేలాది మంది భక్తులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం కొనసాగుతోంది.

ఈ సంస్థ డైరెక్టర్స్ వందనా అగర్వాల్, పలక్ అగర్వాల్ మాట్లాడుతూ... దివ్యాంగులకు సహాయం చేస్తూ గంగా స్నానం చేయిస్తున్నామని, ట్రైసైకిల్స్, వీల్‌చైర్స్ కూడా అందిస్తున్నామని చెప్పారు. ప్రమాదంలో దివ్యాంగులైన వారికి మహాకుంభ్ నగర్‌లోనే కొలతలు తీసుకుని ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు అమరుస్తున్నారు.
 
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu