కుంభమేళాలో సినీతారల సందడి ...

Published : Feb 24, 2025, 11:45 PM IST
కుంభమేళాలో సినీతారల సందడి ...

సారాంశం

బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, రవీనా టండన్ మహాకుంభమేళాలో పాల్గొని సంగమస్నానం చేసారు. గంగా హారతిలో పాల్గొన్నారు.

kumbh Mela 2025 : ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా ముగియడానికి ఇంకో రెండు రోజులే ఉంది. ఫిబ్రవరి 26న శివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. ఈ క్రమంలో ఇవాళ(సోమవారం) బాలీవుడ్ యాక్టర్లు అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, రవీనా టండన్, రాషా టండన్, సోనాలి బింద్రే ప్రయాగ్‌రాజ్‌లోని సంగమంలో పుణ్యస్నానం చేసారు. సాయంత్రం కత్రినా, రవీనా గంగా హారతిలో కూడా పాల్గొన్నారు. ఈ టైంలో రవీనా కూతురు కూడా భక్తిలో మునిగిపోయింది. 

మహాశివరాత్రి వరకు ప్రయాగ్‌రాజ్‌లోనే రవీనా టండన్ 

తన పవిత్ర అనుభవాన్ని పంచుకుంటూ రవీనా ఏఎన్ఐతో మాట్లాడుతూ "ఈ కుంభ్ 144 ఏళ్ల తర్వాత వచ్చింది. అందుకే నేను, నా ఫ్రెండ్స్ ముంబై నుంచి ఇక్కడికి వచ్చాం. గంగా స్నానం చేసుకున్నాం" అని తెలిపారు. తాను కాశీకి వెళ్లి అక్కడ మహాశివరాత్రి జరుపుకుంటానని రవీనా చెప్పింది. రవీనా కూతురు రాషా టండన్ కూడా ప్రయాగ్‌రాజ్ వచ్చింది. గంగా హారతిలో కూడా పాల్గొంది. బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ కూడా స్వామి చిదానంద సరస్వతిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. 

 తాను అదృష్టవంతురాలినని చెప్పిన కత్రినా కైఫ్

ఏఎన్ఐతో మాట్లాడుతూ, కత్రినా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపింది. "నేను ఈసారి ఇక్కడకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను...చాలా సంతోషంగా ఉన్నాను. నేను స్వామి చిదానంద సరస్వతిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. ఇక్కడ నా అనుభవాన్ని మొదలు పెడుతున్నాను. నాకు ప్రతిదీ నచ్చింది, ఇక్కడి ఎనర్జీ, అందం, ప్రాముఖ్యత అన్నీ నచ్చాయి. నేను ఇక్కడ రోజంతా గడపడానికి ఎదురు చూస్తున్నాను." అని చెప్పింది.
 

PREV
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu