వచ్చే ఏడాది 2025 ఆరంభంలో జరగబోయే మహా కుంభమేళా కోసం ప్రయాగరాజ్‌సుందరంంగా ముస్తామబవుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది.
ప్రయాగరాజ్ మహా కుంభమేళా కోసం యోగి సర్కార్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వచ్చేఏడాది 2025 ఆరంభంలో ప్రారంభమయ్యే ఈ కుంభమేళాలో కోట్లాది మంది ప్రజలు పాల్గొంటారు. కాబట్టి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం భక్తులు, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఉత్తర ప్రదేశ్ సంస్కృతి, సాంప్రదాయాలను దేశవిదేశాల ప్రజలకు ఈ కుంభమేళా ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది యోగి సర్కార్.
యోగి ప్రభుత్వం ప్రయాగరాజ్‌లో రోడ్లు, కూడళ్ళు, ఫ్లైఓవర్లు, పార్కులు, హోటళ్ల నిర్మాణం, అలంకరణ పనులను అవిశ్రాంతంగా చేపడుతుండుతోంది. ఇందుకోసం నగరానికి జాతీయ, అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ కంపెనీలు చాలా నెలలుగా ప్రయాగరాజ్‌లో మకాం వేసాయి. ఆ కంపనీల అధికారులు, ఉద్యోగులకు, కార్మికులకు వసతితో ప్రయాగరాజ్ లో అద్దెగదులు, హోటళ్ళు, హోమ్‌స్టేలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది.
undefined
నిర్మాణ నిపుణులు దీర్ఘకాలిక వసతి కోరుకుంటున్నందున ఫర్నిష్డ్ నివాసాలకు డిమాండ్ పెరిగినట్లు రెంటల్ సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాణ సంస్థల ఉద్యోగులు, కార్మికులు కారణంగా మధ్య తరగతి, సామాన్య నివాసాలకు కూడా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ప్రయాగరాజ్ ప్రజలు ఖాళీగా ఉన్న గదులు, ఇళ్లను హోమ్‌స్టేలుగా మారుస్తున్నారు. వసతి, భోజనంతో పాటు ఇతర సేవలను అందిస్తూ ఆదాయం పొందుతున్నారు.
ఇక తాత్కాలిక నివాసితుల అవసరాలను తీర్చడంతో రెస్టారెంట్లు, హోటల్లు నిమగ్నమయ్యాయి. ఇలా ప్రయాగరాజ్ లో ప్రస్తుత పరిస్థితులు రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను మాత్రమే కాకుండా ఆతిథ్య రంగానికి కూడా ఊతమిస్తున్నాయి..
ఇదిలావుంటే సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో సనాతన విశ్వాసం యొక్క గొప్ప కార్యక్రమం 2025 మహా కుంభంమేళా కోసం సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని దివ్యంగా, గొప్పగా, ఆధునికంగా, పర్యావరణ అనుకూలంగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంగమ ప్రాంతంలోనే కాకుండా నగరం అంతటా నిర్మాణ, అలంకరణ పనులు జరుగుతున్నాయి.
డిసెంబర్ 15 నాటికి అన్ని నిర్మాణ పనులు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ సంస్థలు రెండూ తమ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాయి, ప్రయాగరాజ్‌ను భారీ మతపరమైన సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నగరంగా మారుస్తున్నాయి.
ప్రయాగరాజ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ మహా కుంభమేళా కోసం జరుగుతున్న ఏర్పాట్లపై స్పందించారు. ఈ గొప్ప కార్యక్రమంలో సందర్శకుల అవసరాలను తీర్చడానికి హోటల్స్, రెస్టారెంట్స్ నిర్వాహకులు తమ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేస్తున్నారన్నారు. చాలా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే నగరంలోని హోటళ్లలో గదులను బుక్ చేసుకున్నాయి, అనేక మంది అధికారులు వారాల తరబడి ఇక్కడే ఉంటున్నారని తెలిపారు.
కార్పొరేట్ బుకింగ్స్ తో పాటు మహా కుంభం రోజులకు వసతిని పొందాలనుకునే భక్తులు, పర్యాటకుల నుండి విచారణలు, ముందస్తు రిజర్వేషన్‌లు పెరుగుతున్నాయి. ఇలా కుంభమేళా ఆతిథ్య రంగంలో ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా ఆదాయానికి కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు ప్రయాగరాజ్ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి.