వణికిస్తున్న వరుస భూకంపాలు.. ఇండోనేషియాలో మరోసారి భారీ ప్రకంపనలు..  

By Rajesh KarampooriFirst Published Dec 3, 2022, 4:54 PM IST
Highlights

ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. దేశంలోని పశ్చిమ జావా ప్రాంతంలో శనివారం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ, భూకంప కేంద్రం భూమికి 118 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ సమాచారాన్ని దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ అందించింది.

గత కొద్ది రోజులుగా పలు దేశాల్లో  వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా శనివారం మధ్యాహ్నాం ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. భారీ భూకంపం దృష్ట్యా సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే ప్రాణ ఆస్థి నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. 

దేశంలోని పశ్చిమ జావా ప్రాంతంలో శనివారం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 118 కిలోమీటర్ల లోతులో నమోదైందని  దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ BMKG తెలిపింది. సునామీ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు 20 సెకన్లపాట్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని ప్రకంపనలు కూడా వచ్చే అవకాశముందని.. అప్రమత్తంగా ఉండాలని యుఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు.  

click me!