జయ మేనకోడలు దీపకు ఊరట.. ‘‘ వేద నిలయం ’’ ఆమెకే, మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు

By Siva KodatiFirst Published Nov 24, 2021, 10:06 PM IST
Highlights

దివంగత తమిళనాడు (tamilnadu) మాజీ ముఖ్యమంత్రి జయలలిత (jayalalitha) నివాసం ‘వేద నిలయానికి (veda nilayam) సంబంధించి మద్రాస్ హైకోర్ట్ (madras high court) బుధవారం కీలక తీర్పును వెలువరించింది. జయలలిత చట్టబద్ధ వారసులకు వేద నిలయాన్ని మూడు వారాల్లోగా అప్పగించాలని చెన్నై జిల్లా కలెక్టర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. 

దివంగత తమిళనాడు (tamilnadu) మాజీ ముఖ్యమంత్రి జయలలిత (jayalalitha) నివాసం ‘వేద నిలయానికి (veda nilayam) సంబంధించి మద్రాస్ హైకోర్ట్ (madras high court) బుధవారం కీలక తీర్పును వెలువరించింది. ఈ ఆస్తి ఆమె వారసులకే చెందుతుందని స్పష్టం చేసింది. ఈ బంగళాను స్మారక కేంద్రంగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది. జయలలిత మేనల్లుడు దీపక్ (deepak), మేనకోడలు దీప (deepa) దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ ఎన్ శేషశాయి ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

2016లో జయలలిత మరణానంతరం ఆమె నివాసం వేద నిలయాన్ని స్మారక కేంద్రంగా మార్చుతామని 2017లో అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి (edappadi k palaniswami) ప్రకటించారు. ఇందుకోసం వేద నిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కూడా. అన్న మాట ప్రకారం దీనిని స్మారక కేంద్రంగా ప్రారంభించినప్పటికీ, ప్రజల సందర్శనకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో జయలలితకు చట్టబద్ధ వారసులుగా దీప, దీపక్‌లను గుర్తిస్తూ అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం వేద నిలయం విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ALso Read:జయలలిత ఇంట్లో 4 కిలోల 372 గ్రాముల బంగారం: తమిళనాడు సర్కార్

దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం.. వేద నిలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసింది. అలాగే జయలలిత పేరు మీద రెండు స్మారక కేంద్రాలు ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. జయలలిత చట్టబద్ధ వారసులకు వేద నిలయాన్ని మూడు వారాల్లోగా అప్పగించాలని చెన్నై జిల్లా కలెక్టర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. దీనితో పాటు దివంగత జయలలిత పన్ను బకాయిలు ఏమైనా చెల్లించాల్సి వుంటే.. వాటి వసూలుకు తగిన చర్యలు తీసుకోవచ్చునని ఆదాయపు పన్ను శాఖకు (income tax department) హైకోర్టు సూచించింది. 

కాగా... చెన్నై (chennai) నగరంలోని ఆళ్వార్ పేటలోని (alwarpet) పొయెస్ గార్డెన్‌లో (poes garden) వేద నిలయం ఉంది. 24,322 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వేద నిలయంలో జయలలిత దాదాపు 40 సంవత్సరాలు నివసించారు. తమిళనాడు రాజకీయాల్లో (tamilnadu politics) చోటు చేసుకున్న అనేక చారిత్రక నిర్ణయాలకు వేద నిలయం వేదికగా నిలిచింది.  

click me!