ఇద్దరమ్మాయిల మధ్య లవ్: ఇంటి నుండి జంప్, కోర్టుకు

By narsimha lodeFirst Published Apr 1, 2021, 2:03 PM IST
Highlights

ఇద్దరమ్మాయిలు సహజీవనం చేసేందుకు సిద్దమయ్యారు.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని ఇద్దరమ్మాయిలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

చెన్నై: ఇద్దరమ్మాయిలు సహజీవనం చేసేందుకు సిద్దమయ్యారు.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని ఇద్దరమ్మాయిలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఇద్దరమ్మాయిల మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది.  వీరిద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది.  ఈ విషయం తెలిసిన ఇద్దరి పేరేంట్స్ వీరిని విడదీసేందుకు ప్రయత్నించారు.తల్లిదండ్రుల నుండి తప్పించుకొన్న వీరిద్దరూ చెన్నైలోని ఓ స్వచ్చంధ సంస్థను ఆశ్రయించారు.ఈ స్వచ్ఛంధ సంస్థ ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. తమకు భద్రత కల్పించాలని కోరారు. తమ గురించి ఎందుకని వారు ప్రశ్నించారు. 

ఈ పిటిషన్ ను బుధవారం నాడు హైకోర్టు  విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను విన్న హైకోర్టు ఇప్పటికిప్పుడు ఈ కేసులో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. ఈ తరహా కేసుల్లో  ఇదివరకు కోర్టులు ఇచ్చిన  తీర్పులను పరిశీలిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఇద్దరు యువతులు, వారి కుటుంబసభ్యులు వాంగ్మూలాలను కోర్టు వేర్వేరుగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.  

ఈ విషయమై సమగ్ర విచారణతో ఏప్రిల్ 26వ తేదీన కోర్టుకు నివేదికను సమర్పించాలని సామాజిక కార్యకర్త విద్య దినకర్ ను కోర్టు ఆదేశించింది.

click me!