రాష్ట్ర గీతాన్ని అవమానించారంటూ... ఆర్బీఐ సిబ్బందిపై తమిళ సంఘాల ఆగ్రహం, కార్యాలయం ముట్టడి

By Siva KodatiFirst Published Jan 27, 2022, 2:53 PM IST
Highlights

ఆర్బీఐ ఉద్యోగులు తమ రాష్ట్రీయ గీతాన్ని అవమానించారంటూ తమిళ సంఘాల ఆందోళనలు చేస్తున్నాయి. అంతేకాదు ఆర్బీఐ ఆఫీసు ముట్టడికి తమిళ సంఘాల పిలుపు నిచ్చాయి. దీంతో పోలీసులు ఆర్బీఐ కార్యాలయం చుట్టూ భారీగా  మోహరించారు.

తమిళులు(Tamils) తమ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాల అత్యంత విలువ ఇస్తారు. రాష్ట్రానికి గానీ.. వారి సాంప్రదాయల గౌరవానికి కానీ ఏ మాత్రం భంగం కలిగినా సహించరు. అంతా ఒక్కటై పోరాడతారు. తాజాగా ఈ విషయం మళ్ళీ 73 రిపబ్లిక్ డే వేడుకల (Republic Day Celebrations) సందర్భంగా రుజువైంది. తమిళ సాంప్రదాయం ప్రకారం.. నిర్వాహకులు వేడుకలలో తమిళ్‌తాయ్‌ వాళ్తు గీతాన్ని ఆలపించారు. అయితే ఈ సందర్భంగా ఆర్బీఐ ఉద్యోగులు తమ రాష్ట్రీయ గీతాన్ని అవమానించారంటూ తమిళ సంఘాల ఆందోళనలు చేస్తున్నాయి. అంతేకాదు ఆర్బీఐ ఆఫీసు ముట్టడికి తమిళ సంఘాల పిలుపు నిచ్చాయి. దీంతో పోలీసులు ఆర్బీఐ కార్యాలయం చుట్టూ భారీగా  మోహరించారు.

రిపబ్లిక్ డే వేడుకలలో తమిళ రాష్ట్ర గీతం ఆలపిస్తున్న సమయంలో కొందరు ఆర్బీఐ సిబ్బంది నిలబడకుండా కూర్చుని వున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో తమిళ సంఘాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర గీతం ఆలపిస్తున్న సమయంలో కూర్చుని ఉండటం తప్పంటూ ఆర్బీఐ సిబ్బంది వైఖరిని తప్పుబట్టాయి. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ నియమాలను ఆర్బీఐ సిబ్బంది ఎందుకు పాటించరని డీఎంకే ఎంపీ కనిమొళి ప్రశ్నించారు. ఆర్బీఐ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి, తమిళ గీతానికి ఎందుకు మర్యాద ఇవ్వరని మండిపడ్డారు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులపై మద్రాస్ హైకోర్టు న్యాయవాది జి రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు త‌మిళ‌నాడులో హిందీ భాష ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. హిందీ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దాల‌ని చూసిన‌ప్పుడు త‌మిళ స‌మాజం భ‌గ్గుమంది. తాజాగా దీనిపై డీఎంకే అధ్య‌క్షుడు, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే.స్టాలిన్ (Tamil Nadu Chief Minister MK Stalin) మాట్లాడుతూ.. మేము హిందీకి వ్య‌తిరేకం కాద‌నీ, హిందీ విధింపును వ్య‌తిరేకిస్తున్నామ‌ని అన్నారు.  హిందీ విధింపుపై నిరసనల పరంపర నుండి పుట్టిన మంటలు చల్లారబోవని తెలిపారు. హిందీ సహా ఏ భాషకైనా త‌మిళ‌నాడు వ్యతిరేకం కాదని అన్నారు. కానీ హిందీని త‌మిళ‌నాడుపై బ‌ల‌వంతంగా రుద్దాల‌నే విధింపును వ్య‌తిరేకిస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌మిళులు త‌మ మాతృభాష‌, సంస్కృతిని నిపుపుకోవ‌డానికి చేస్తున్న కృషి నేప‌థ్యంలో దాని స్థానంలో ఇత‌ర భాష‌ల తీసుకురావ‌ల‌నే ప్ర‌య‌త్నాలు నిరాక‌రిస్తే దానిని సంకుచిత మనస్తత్వంగా భావించరాదని ఆయన అన్నారు.

click me!