అత్తింటివారి శిక్ష.. భర్తను భుజాలపై మోస్తూ...

By telugu news teamFirst Published Jun 22, 2020, 11:52 AM IST
Highlights

ఒక గిరిజన మహిళకు అత్త‌వారంట విచిత్ర‌మైన శిక్ష ఎదుర‌య్యింది. ఇంటి నుంచి మాయ‌మై, వారం తరువాత ఇంటికి తిరిగి వచ్చిన కోడ‌లికి ఆమె అత్తామామలు విచిత్ర‌మైన శిక్ష విధించారు.
 

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ముందుకు దూసుకుపోతున్నా... ఇప్పటికీ మన దేశంలో స్త్రీలు అవస్థలు పడుతూనే ఉన్నారు. వివిధ కారణాలతో అత్తింటివారు పెళ్లైన మహిళలను వేధిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళకు అత్తింటివారు వేసిన శిక్ష వింటే.. ఎవరైనా నివ్వెరపోవాల్సిందే.. రెండు రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిందనే కారణంతో.. దారుణమైన శిక్ష వేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఝాబువా జిల్లాలోని కల్యాణపుర పోలీస్‌స్టేషన్ ప‌రిధిలోగ‌ల‌ ఖేడా గ్రామంలో ఒక గిరిజన మహిళకు అత్త‌వారంట విచిత్ర‌మైన శిక్ష ఎదుర‌య్యింది. ఇంటి నుంచి మాయ‌మై, వారం తరువాత ఇంటికి తిరిగి వచ్చిన కోడ‌లికి ఆమె అత్తామామలు విచిత్ర‌మైన శిక్ష విధించారు.

 భర్తను భుజంపైకి ఎక్కించుకుని, మార్కెట్ అంతా తిరిగిరావాల‌ని ఆదేశించారు. ఆమె వేరెవ‌రినో ప్రేమిస్తున్న‌ద‌నే అనుమానంతో అత్తామామ‌లు కోడ‌లికి ఇటువంటి శిక్ష విధించారు.  బాధిత మ‌హిళ జూన్ 13న పొరుగు గ్రామానికి వెళ్లింది. వారం త‌రువాత ఆమె అత్త‌వారింటికి రాగానే, ఆమెను మంద‌లిస్తూ, భ‌ర్త‌ను భుజాల‌పైకి ఎక్కించుకుని ఊరంతా తిప్పాల‌ని ఆదేశించారు. 

దీంతో ఆమె అత్తామామ‌ల ఆదేశాల‌ను పాటించింది. అయితే ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారి, పోలీసుల వ‌ర‌కూ చేరింది. ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డిన ఎనిమిదిమంది నిందితులపై కేసు నమోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఝాబువా ఎస్పీ తెలిపారు. 
 

click me!