లగ్జరీ కార్లే టార్గెట్.. దొంగల ముఠాలో సినీనటుడు

Published : Jun 22, 2020, 10:34 AM IST
లగ్జరీ కార్లే టార్గెట్.. దొంగల ముఠాలో సినీనటుడు

సారాంశం

ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను మీడియాకు చూపించారు. అత్యంత ఖరీదైన కార్లు, ఇతర వాహనాలు ఇందులో ఉన్నాయి.

అదో పెద్ద దొంగల ముఠా. చిన్నా, చితక వస్తువులు వాళ్లు దొంగతనం చేయరు. కేవలం లగ్జరీ కార్లే వారి టార్గెట్. వాళ్ల కంట్లో పడితే చాలు ఎలాంటి కారైనా చోరీకి గురవ్వాల్సిందే. అయితే.. ఎట్టకేలకు ఆ దొంగల ముఠాను పోలీసులు పట్టుకోగా... నిందితుల్లో ఓ సినీ నటుడు ఉన్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపగా.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... లగ్జరీ కార్లను దొంగతనం చేసి వాటితో వ్యాపారం చేసే ముఠాను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా వద్ద నుంచి 50 లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ పాండే తెలిపారు. ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను మీడియాకు చూపించారు. అత్యంత ఖరీదైన కార్లు, ఇతర వాహనాలు ఇందులో ఉన్నాయి.

అరెస్టైన వారిలో ఓ సినిమా నటుడు కూడా ఉన్నాడు. ఇతడు మూడు సినిమాల్లో నటించాడని పోలీసులు తెలిపారు. విలేకరిగా కూడా పనిచేస్తున్నాడని వెల్లడించారు. అరెస్టైన వారిలో మరొక నిందితుడు దొంగిలించిన కార్ల ద్వారా వచ్చే సొమ్ముతో బ్యాంకాక్‌లో హోటల్ నిర్మిస్తున్నాడని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

మరో వీడియో రిలీజ్ చేసిన మోదీ ఏమన్నారంటే? | PM Narendra Modi Releases Another Video on Exam Reforms
ప‌రీక్ష‌ల వ్య‌వ‌స్థ‌లో కేంద్రం భారీ సంస్క‌ర‌ణ‌లు.. హైప‌వ‌ర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు