పుట్టింటికి వచ్చిందని మహిళను జట్టుపట్టి ఈడ్చి.. చెట్టుకు కట్టేసి..!

Published : Jul 03, 2021, 09:44 AM IST
పుట్టింటికి వచ్చిందని మహిళను జట్టుపట్టి ఈడ్చి.. చెట్టుకు కట్టేసి..!

సారాంశం

అత్తారింటిని వదిలేసి వచ్చిందంటూ అతి దారుణంగా కొట్టారు. గ్రామస్థులంతా  చూస్తుండగా.. జుట్టుపట్టుకొని లాక్కెల్లారు.  చెట్టుకు కట్టేసి మరీ అతి దారుణంగా కొట్టారు

ఓ మహిళకు మూడు నెలల క్రితం వివాహమైంది. పాపం.. అత్తారింట్లో ఉన్న మహిళకు.. తన వాళ్లను చూడాలని అనిపించింది. ఒక్కసారి పుట్టింకి రావాలని అనుకుంది. అంతే.. సంతోషంగా పుట్టింటికి చేరింది. అయితే.. అక్కడ ఆమెకు ఊహించని షాక్ ఎదురైంది.

అత్తారింటిని వదిలేసి వచ్చిందంటూ అతి దారుణంగా కొట్టారు. గ్రామస్థులంతా  చూస్తుండగా.. జుట్టుపట్టుకొని లాక్కెల్లారు.  చెట్టుకు కట్టేసి మరీ అతి దారుణంగా కొట్టారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి(19) మూడు నెలల క్రితం వివాహమైంది. ఒక్కసారి చూసి పోదామని సదరు యువతి పుట్టింటికి వచ్చింది. అయితే.. అలా వచ్చినందుకు ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లారు. దగ్గరలోని చెట్టుకు  కట్టేసి.. కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు.

యువతి కొట్టొద్దని ఎంత వేడుకున్నా.. వదిలిపెట్టకపోడవం గమనార్హం. కాగా.. దీనిని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. అక్కడ చాలా మంది ఉన్పప్పటికీ.. కనీసం ఒక్కరు కూడా సహాయం చేయడానికి  ముందుకు రాకపోవడం గమనార్హం. 

కాగా.. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువతి పై దాడి చేసిన ఆమె తండ్రి, కజిన్స్ పై కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

ఉత్తరాఖండ్‌లో గ్యాస్ కొరత.. హోటల్స్ లో ఏం చేశారో చూడండి | LPG Shortage | Asianet News Telugu
జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంలో Aviation Minister Rammohan Naidu Speech| Asianet News Telugu