కమల్‌నాథ్ సర్కార్‌కు గండం: బెంగళూరుకు 17 మంది ఎమ్మెల్యేలు, సింధియా తిరుగుబాటు

By Siva KodatiFirst Published Mar 9, 2020, 7:40 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం అంచున నిలిచింది. పార్టీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా సంక్షోభానికి తెరలేపారు. ఆయన వర్గంలోని 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఆరుగురు మంత్రులతో సహా ప్రత్యేక విమానంలో బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు తరలించారు

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం అంచున నిలిచింది. పార్టీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా సంక్షోభానికి తెరలేపారు. ఆయన వర్గంలోని 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఆరుగురు మంత్రులతో సహా ప్రత్యేక విమానంలో బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు తరలించారు.

దీంతో కమల్‌నాథ్‌ సర్కార్‌కు గండం పొంచి వుంది. ఒకప్పుడు గాంధీలతో సన్నిహితంగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు ఆయనతో రాజీ కోసం చర్చలు జరుపుతున్నారు.

Also Read:మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ తొలిసంతకం ఆ ఫైలుపైనే

అయితే ఇది అంత తేలికకాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 49 సింధియాకు 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి చిక్కినట్లే చిక్కి తృటిలో తప్పిపోయింది.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ.. కేవలం 23 మంది ఎమ్మెల్యేల మద్ధతు మాత్రమే జ్యోతిరాదిత్య సింధియా పొందగలిగారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కమల్‌నాథ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ను నియంత్రించే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించింది.

కాంగ్రెస్ సభ్యులతో పాటు ఆరుగురు మంత్రులు రెబెల్స్‌గా మారడంతో ప్రతిపక్ష బీజేపీ శాసనసభలో కమల్‌నాథ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతోంది.

Also Read:ఏపీకి అన్యాయం జరిగింది: కమల్‌నాథ్

దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సంక్షోభంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం కనిపించకుండా పోవడం కలకలం రేపింది. వీరిలో తొలుత ఆరుగురు వెనక్కి రాగా.. ఆ తర్వాత మిగిలిన నలుగురిలోనూ మరో ఇద్దరు వెనక్కి వచ్చారు. 

click me!