లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కి, భయంతో ఆ డబ్బు మింగేశాడు..!

Published : Jul 25, 2023, 09:43 AM IST
లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కి, భయంతో ఆ డబ్బు మింగేశాడు..!

సారాంశం

వారు పన్నిన ఉచ్చులో ఆ రెవిన్యూ అధికారి పట్వారీ గజేంద్ర సింగ్ పడిపోయాడు. తన ప్రైవేట్ కార్యాలయంలో రూ.5వేలు లంచంగా తీసుకున్నాడు. అయితే, అధికారులు తనను పట్టుకున్నారు అనే కంగారు అతనిలో మొదలైంది.

ప్రభుత్వ అధికారులు చాలా మంది లంచానికి అలవాటు పడిపోతున్నారు. ఏ పని చేయాలన్నా లంచం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ లంచం తీసుకుంటున్న అధికారిని అవినీతి శాఖ అధికారులు పట్టుకున్నారు. అయితే, వారి నుంచి తప్పించుకునేందుకు ఆ అధికారి ఏకంగా, ఆ డబ్బులను నమలి మింగేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా,  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నిలోని రెవెన్యూ విభాగానికి చెందిన ఓ అధికారి లంచం తీసుకుంటున్నాడు. అయితే, అతను లంచం తీసుకుంటున్న విషయం లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ బృందానికి ముందే తెలిసిపోయింది. దీంతో, వారు  ముుందుగానే ప్లాన్ చేసి మరీ అతనని పట్టుకోవాలని అనుకున్నారు.

 

వారు పన్నిన ఉచ్చులో ఆ రెవిన్యూ అధికారి పట్వారీ గజేంద్ర సింగ్ పడిపోయాడు. తన ప్రైవేట్ కార్యాలయంలో రూ.5వేలు లంచంగా తీసుకున్నాడు. అయితే, అధికారులు తనను పట్టుకున్నారు అనే కంగారు అతనిలో మొదలైంది. ఎలా తప్పించుకోవాలో తెలియక వెంటనే తన దగ్గర ఉన్న రూ.5వేలను నోట్లో పెట్టుకొని నమిలేశాడు. దీనిని అధికారులు అందరూ కళ్లారా  చూడటం గమనార్హం. అయితే, అధికారులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పడం గమనార్హం.

అయితే, గజేంద్ర సింగ్ తనను లంచం అడుగుతున్నాడని ఓ వ్యక్తి వచ్చి లోకాయుక్త స్పెషల్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, వారు వెళ్లే సరికి అతను ఆ డబ్బు తీసుకొని నమిలి మింగడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?