అమానుషం : సంతానం కోసం.. యువతిని కొనుక్కొచ్చి, 16నెలలు బంధించి అత్యాచారం.. సహకరించిన భార్య...

By AN TeluguFirst Published Nov 13, 2021, 8:48 AM IST
Highlights

16 నెలల క్రితం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓ మహిళ వద్ద నుంచి  ఓ యువతి(21)ని కొనుగోలు చేశారు. ఆ యువతి ద్వారా సంతానం కలగాలని స్కెచ్ వేశారు.

ఉజ్జయిని :  కొన్ని ఘటనలు విన్నప్పుడు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంటుంది. ఇంతటి దారుణానికి తెగబడతారా? అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత అమానుషం ఎక్కడైనా ఉంటుందా అని జుగుస్స కలుగుతుంది. మహిళల మీద జరిగే అఘాయిత్యాలకు మహిళలే సహకరించినప్పుడు భయం వేస్తుంది. అలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. 

మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో అమానుష ఘటన చోటుచేసుకుంది.  సంతానం కోసం అని  ఓ యువతిని బంధించిన ఓ వ్యక్తి ఆమెపై 16 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు అతని భార్య సహకరించడం గమనార్హం. చివరకు శిశువు జన్మించాక బాధితురాలిని ఈ నెల 6న బస్టాండ్ వద్ద పడేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

నాలుగేళ్ల చిన్నారిపై రేప్: నిందితుడికి నెల రోజుల్లోనే జీవిత ఖైదు

Ujjainలోని కథ్  బరోడా గ్రామానికి చెందిన  రాజ్ పాల్ సింగ్(38),  చంద్రకాంత 26 దంపతులు. గతంలో Rajpal Singh ఉప సర్పంచ్ గా పనిచేశాడు. అయితే, వారికి  ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారిద్దరు ఏవో అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. తరువాత వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో children కోసం ఆ దంపతులు దారుణమైన ఆలోచన చేశారు.

అనాధ బిడ్డను దత్తత తీసుకుంటే.. ఓ తల్లిలేని చిన్నారికి జీవితాన్ని ఇచ్చిన వారమవుతామన్న ఆలోచన చేయలేకపోయారు. తమ రక్తం అనే మూర్ఖపు ఆలోచన చేశారు. దీనికోసం 16 నెలల క్రితం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓ మహిళ వద్ద నుంచి  ఓ యువతి(21)ని కొనుగోలు చేశారు. ఆ యువతి ద్వారా సంతానం కలగాలని స్కెచ్ వేశారు.

Norovirus : కేరళలో కలవరం సృష్టిస్తున్న మరో కొత్త వైరస్.. 13 మందికి ‘నోరో’ !

young ladyని కొన్నప్పటి నుంచి victimని వారి ఇంట్లోనే బందీగా వుంచి రాజ్ పాల్ సింగ్ అనేక సార్లు rapeకి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. దీనికి రాజ్ పాల్ సింగ్ భార్య చంద్రకాంత కూడా సహకరించడం ఒళ్లు గగుర్పొడిచే విషయం. pregnant అయిన యువతి గత నెల 25న శిశువుకు జన్మనిచ్చింది. 

బస్టాప్ వద్ద పడేసి పరార్
కాగా ఈ నెల 6న అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని దేవాస్ బస్టాప్ వద్ద పడేసి రాజగోపాల్ పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించింది.  తనపై జరిగిన అమానుషాన్ని వారికి వివరించింది. దీంతో పోలీసులు  దర్యాప్తు చేపట్టారు. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం రాజబాబు దంపతులు సహా వారి ముగ్గురు బంధువుల పైన కేసు నమోదు చేశారు. 

Human traffickingకు కూడా పాల్పడినట్లు కేసులో పేర్కొన్న పోలీసులు..  బాధితురాలిని విక్రయించిన వారి వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నారు.  ప్రధాన నిందితుడు రాజ్ పాల్ ను అరెస్టు చేశారు. మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. 
 

click me!