Madhya Pradesh: మాన‌వ‌త్వానికి మ‌చ్చ‌.. ప‌సివాడి చేతుల్లో తమ్ముడి శ‌వం.. లంచం ఇవ్వ‌క‌పోతే అంబులెన్స్ నిరాక‌ర‌ణ

By Rajesh KFirst Published Jul 11, 2022, 4:52 AM IST
Highlights

 Madhya Pradesh: మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో వెలుగులోకి వ‌చ్చింది. మొరెనాలోని ఓ ఆస్ప్ర‌తి ప్రాంగ‌ణంలో అభంశుభం తెలియ‌ని 8 ఏళ్ల  బాలుడు..  తన 2 ఏళ్ల తమ్ముడి మృతదేహాన్ని దాదాపు 2 గంట‌ల‌పాటు.. ప‌ట్టుకుని ఒంటరిగా కూర్చున్నాడు.

Madhya Pradesh: మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు' అంటాడు క‌వి అందెశ్రీ... నిజంగా ఆయ‌న మాటలు నేడు అక్షర సత్యాల‌వుతున్నాయి. రోజురోజుకు మనుషుల్లో మాన‌వ‌త్వం క‌నుమరుగ‌వుతోంది. క‌నీసం సాటి మనిషి మీద క‌నిక‌రం చూపే మ‌నసు లేకుండా పోతుంది. మ‌రి దారుణ‌మేమిటంటే.. ప్రాణాలు పోయి.. ఒక్క‌డు త‌ల్లాడితుంటే.. పైసాల కోసం శ‌వాలను పీకుతినేలా మారారు.  

మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో వెలుగు చూసింది. మొరెనాలోని ఓ ఆస్ప్ర‌తి ప్రాంగ‌ణంలో అభంశుభం తెలియ‌ని 8 ఏళ్ల  బాలుడు..  తన 2 ఏళ్ల తమ్ముడి మృతదేహాన్ని దాదాపు 2 గంట‌ల‌పాటు.. ప‌ట్టుకుని ఒంటరిగా కూర్చున్నాడు. ఈ ద‌యనీయ‌మైన దృశ్యాన్ని చూస్తే.. ఎవ‌రి కళ్లైనా చమర్చక మానవు. 

మ‌రోవైపు.. త‌న క‌న్న‌కొడుకు మృత‌దేహాన్ని స్వ‌గ్రామానికి తీసుకెళ్లడానికి ఓ తండ్రి..  అంబులెన్స్ పంపడానికి  ఆస్ప‌త్రి వ‌ర్గాల‌ను అడ‌గ్గా.. లంచమివ్వ‌నిదే.. అంబులెన్స్ పంప‌మని తెగేసి చెప్పారు. దీంతో  ఏం చేయాలో అర్థం కాని ఆ తండ్రి..  నిస్సాహాయస్థితిలో త‌న చిన్న కూమారుడి శ‌వానికి పెద్ద కూమారుడిని కాపలాగా ఉంచి.. ఇత‌రులు స‌హయం కోసం చేతులు చాచాడు. నిజంగా ఈ  ఘ‌ట‌న మాన‌వ‌త్వానికి ఓ మ‌చ్చ. 

వివరాల్లోకెళ్తే..  మొరెనా జిల్లాలోని అంబాహ్ నివాసి పూజారామ్ జాతవ్..  త‌న  2 సంవత్సరాల కుమారుడు రాజాను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. గ‌త కొన్ని రోజులుగా రాజా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు.  పూజారాం తన పెద్ద‌ కొడుకు గుల్షన్‌(8)తో కలిసి.. రెండేండ్ల కొడుకు రాజాను ఆస్పత్రికి తీసుక వచ్చాడు. అయితే.. రాజా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
 
రాజా మరణవార్త తెలుసుకున్న‌ పూజారాం త‌ల్లాడిలాడు. తనకు తాను ధైర్యం చెప్పుకుని త‌న కొడుకు మృత‌దేహాన్నిత‌న స్వ‌గ్రామానికి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ మేర‌కు అంబులెన్స్  ఇవ్వాల‌ని ఆస్ప‌త్రి సిబ్బందిని అడిగాడు.  

లంచం ఇస్తేనే.. అంబులెన్స్  

త‌న కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు పూజారాం ఆస్ప‌త్రి సిబ్బందిని ప్రాదేహప‌డ్డారు.  అయినా., క‌నీస‌ మాన‌వ‌త్వం చూపించ‌కుండా.. రూ1500 లు ఇస్తేనే.. అంబులెన్స్ ను పంపిస్తామ‌ని తెలిపారు. తన వద్ద‌ అంత డబ్బు లేదని చెప్పాడు. త‌న చిన్నారి మొహం చూసైనా పంపించాలని ప్రాదేహప‌డ్డాడు. కానీ.. ఏ మాత్రం క‌నిక‌రం చూపినా ఆ ఆస్ప‌త్రి సిబ్బంది.. డబ్బులిస్తేనే.. అంబులెన్స్ పంపిస్తామ‌ని నిర్మోహ‌మ‌టంగా.. తెగేసి చెప్పారు.

ఈ క్ర‌మంలో ప్రైవేట్ అంబులెన్స్‌లను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. అటువంటి పరిస్థితిలో చిన్న‌కొడుకు రాజా మృతదేహాన్ని తన పెద్ద కొడుకు ఒడిలో ఉంచుకుని పూజారామ్ తక్కువ రేటు అంబులెన్స్ కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్ర‌మంలో ప‌లువురి స‌హయాన్ని కూడా అర్థించారు. ఈ విష‌యం గురించి ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న కొత్వాలి టిఐ యోగేంద్ర యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ముందుగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్‌ ఏర్పాటు చేసి మృతదేహాన్ని వారి సొంత గ్రామానికి పంపించారు.

click me!