వరద బాధితుల పరామర్శకు వెళ్లి నీటిలో చిక్కుకొన్న మంత్రి: హెలికాప్టర్‌తో రెస్క్యూ, వీడియో వైరల్

By narsimha lodeFirst Published Aug 5, 2021, 2:46 PM IST
Highlights


వరద ప్రభావిత ప్రాంతంలో ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి వరద నీటిలో చిక్కుకొన్నారు. చివరకు మంత్రిని హెలికాప్టర్ సహాయంతో రక్షించారు.

భోపాల్:వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన మంత్రి వరద నీటిలో చిక్కుకుపోయారు. చివరకు మంత్రిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియా జిల్లాలో వరదలు సంభవించాయి. వరద ప్రభావిత ప్రాంతంలో హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా బుధవారం నాడు పరిశీలనకు వెళ్లారు. కొట్రా గ్రామానికి మంత్రి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి పడవలో వెళ్తున్న సమయంలో  ఆకస్మాత్తుగా చెట్టు పడింది. దీంతో పడవ స్టార్ట్ కాలేదువరద నీటిలోనే పడవ నిలబడిపోయింది.

కోట్రా గ్రామానికి వెళ్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల పైకప్పుపై నిలబడ్డారని మంత్రికి సమాచారం అందింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మంత్రి అక్కడికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.వరద నీటిలో చిక్కుకొన్న మంత్రి సహాయం చేయాలని కొందరు ప్రభుత్వ అధికారులకు సమాచారం పంపాడు. దీంతో ఐఎఎఫ్ హెలికాప్టర్ ను పంపారు. మంత్రి సహా 9 మంది గ్రామస్తులను హెలికాప్టర్ సహాయంతో రక్షించారు. 

వరదనీటిలో మంత్రి చిక్కుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలతో వరదలు పలు జిల్లాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేశాయని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. షెయోపూర్, డాటియా, గ్వాలియర్, గుణ, బింద్, మెరెనా జిల్లాల్లో  భారీ వర్షాలు కురిశాయి.ఆర్మీ,ఎన్డీఆర్ఎఫ్‌నకు చెందిన 70 బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.ఐదు వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు గ్వాలియర్లో నాలుగు, శివపురిలో ఒకటి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.


 

click me!