ఖరీదైన వజ్రం దొరికింది.. ఆ రైతు దశ తిరిగింది.. వేలంలో వచ్చే ధర తెలిస్తే....

Published : May 05, 2022, 09:26 AM ISTUpdated : May 05, 2022, 09:44 AM IST
ఖరీదైన వజ్రం దొరికింది.. ఆ రైతు దశ తిరిగింది.. వేలంలో వచ్చే ధర తెలిస్తే....

సారాంశం

మధ్యప్రదేశ్ లోని ఓ రైతును అదృష్టం వరించింది. అతడికి 11.88 క్యారెట్ల ముడి వజ్రం దొరికింది. ఇది ఎంతో నాణ్యమైందని అధికారులు అంటున్నారు. 

పన్నా : Diamondsకు పేరుగాంచిన madhapradeshలోని పన్నా జిల్లాలో అదృష్టం మరో farmerను వరించింది. భూమిని నమ్ముకొని బతుకుతున్న ఓ చిన్న రైతు లీజ్ తీసుకున్న గనిలో వజ్రం దొరికింది. ప్రతాప్ సింగ్ యాదవ్ అనే రైతు తన గనిలో మూడు నెలలుగా ఎంతో శ్రమించి పనిచేయగా… 11.88 క్యారెట్ల వజ్రం దొరికినట్లు వజ్రాల కార్యాలయం అధికారి రవి పటేల్ వెల్లడించారు. ఇది ఎంతో నాణ్యతతో కూడినదని.. త్వరలో జరగబోయే వేలంలో అమ్మకానికి ఉంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా రైతు యాదవ్ మాట్లాడుతూ… ‘నేను చాలా పేద రైతును.. కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. కూలీగా పని చేసుకుంటున్నాను . గత మూడు నెలలుగా ఈ గనిలో ఎంతో శ్రమించాను. నాకు దొరికిన డైమండ్ వజ్రాల కార్యాలయంలో అప్పగించాను’ అన్నారు. డైమండ్ వేలంలో తనకు వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానని, తన పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని ఆ రైతు చెప్పుకొచ్చాడు.. ఎంతో నాణ్యతతో కూడినది కావడంతో ఈ డైమండ్ ధర సుమారు రూ. 50 లక్షల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు.  మరోవైపు ఈ ముడి వజ్రాన్ని వేలం వేసి ప్రభుత్వ రాయల్టీ, పన్నులను మినహాయించి వచ్చిన మొత్తాన్ని రైతుకు అందజేయనున్నట్లు  అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రం nalgonda, రామన్నపేటలోని మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో ఓ రైతు పొలంలో Hidden treasures లభ్యమైన విషయం ఆలస్యంగా 2021, డిసెంబర్ 30న వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కుంకుడుపాముల గ్రామానికి చెందిన కన్నబోయిన మల్లయ్య సర్వే నంబర్ లు 16, 17లోని తన పొలంలో వారం రోజుల క్రితం గట్లు తీస్తుండగా మట్టిపాత్ర (గురిగి), చిన్న ఇనుపపెట్టె కనిపించాయి. 

మట్టిపాత్రలో 38 silver coins, 5 వెండి పట్టీలు, 14 వెండి రింగులు (విరిగినవి) లభ్యమయ్యాయి. ఇనుపపెట్టెలో 19 gold coinలు (పుస్తెలతాడుకు ఉండేవి) ఐదు బంగారు గుండ్లు ఉన్నాయి. వెండి నాణాలమీద ఉర్దూ పదాలు ఉన్నాయి. కాగా మల్లయ్య తీసి గట్టును ఆనుకుని అతడి సోదరుడు లింగయ్య పొలం ఉంటుంది. అందులో నాటు వేసేందుకు వచ్చిన కూలీలు వాటిని తలా ఒకటి తీసుకోవడానికి చేతిలో పట్టుకున్నారు. 

అదే సమయంలో ఒక మహిళ పూనకం వచ్చినట్టు ఊగి వాటిని ముట్టుకుంటే అరిష్టమని పలకడంతో వారంతా నాణేలు, బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చారు. పొలంలో లభ్యమైన నిధిని మల్లయ్య ఇంటి దగ్గర ఉన్న పెంటకుప్పలో దాచాడు. విషయం తెలుసుకున్న అతడి సోదరుడు లింగయ్య ఇద్దరి మధ్య ఉన్న పొలం గట్టులో దొరికింది కాబట్టి తనకు వాటా కావాలని డిమాండ్ చేశాడు. వరినాట్లు ముగిసిన రెండు రోజుల తరువాత సోదరులిద్దరూ గ్రామంలోని ఓ పెద్దమనిషిని ఆశ్రయించారు. 

సమానంగా పంచుకోవాలని పెద్దమనిషి సలహా ఇచ్చాడు. వాటిని పంచుకునే విషయంలో అన్నదమ్ములిద్దరికీ తేడా వచ్చింది. దీంతో మల్లయ్య మంగళవారం తనకు పొలంలో దొరికిన గుప్తనిధిని రామన్నపేట పోలీసులకు అప్పజెప్పాడు. గుప్తనిధి వివరాలు రెవెన్యూ అధికారులకు అందించామని, గురువారం వారికి అందజేయనున్నట్లు సీఐ చింతా మోతీరాం తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Jaipur Army Day Parade 2026 | CDS Anil Chauhan | Rajasthan CM Bhajanlal Sharma | Asianet News Telugu
జైపూర్‌లో వీర జవాన్లకు నివాళులు: CDS అనిల్ చౌహాన్, COAS జనరల్ ఉపేంద్ర ద్వివేది | Asianet News Telugu