
ఉత్తరప్రదేశ్ : uttarpradeshలోని ఫతేపూర్ లో బాలికపై అత్యాచారానికి సంబంధించిన రేప్ కేసులో మంగళవారం సాయంత్రం నిందితుడైన యువకుడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, అంతలోనే ఆ బాలిక విషం తాగి మరణించడంతో విషాదం నెలకొంది. ఆమె మీద అత్యాచారం జరిగిన ఒక రోజు తర్వాత బాలిక suicide చేసుకుంది. 15 ఏళ్ల దళిత బాలికపై ఆమె గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెడితే.. యుపిలోని ఫతేపూర్ జిల్లాలోని చాంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫతేపూర్ పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, 15 ఏళ్ల దళిత బాలిక మంగళవారం సాయంత్రం తన గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు.. ఆమెను చూశాడు. ఆమె వెంటపడి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే, బైటికి వెళ్లిన బాలిక రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతకగా అడవిలో స్పృహలేని స్థితిలో కనిపించిందని ఎస్పీ తెలిపారు. కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆ బాలిక మనస్తాపంతో బుధవారం తెల్లవారుజామున విషం తాగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, తాగి వచ్చిన మైకంలో భార్యతో గొడవ పడ్డ వ్యక్తి.. ఆమె మీద కోపంతో గొడ్డలి ఎత్తాడు. ఆమె ప్రాణభయంతో పారిపోవడంతో ఆవేశంతో ఊగిపోయాడు. liquor మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో కళ్ళముందు ముగ్గురు చిన్నారులు కనిపించారు. ఆవేశంతో ఊగిపోతున్న తండ్రిని చూసి బిక్కుబిక్కు మనడం తప్ప మరేమీ తెలియని 5 ఏళ్ల కుమార్తె, తండ్రిని గుర్తు పట్టడం తప్ప పరిస్థితి అర్థం చేసుకోలేని రెండేళ్ల కుమారుడు.. తల్లి దగ్గర లేకపోవడంతో పాల కోసం ఏడుస్తున్న ఆరు నెలల చిన్నారి.
ఆ స్థితిలో ఆ పసి వాళ్ళని చూసైనా ఆ కర్కశుడి మనసు కరగలేదు. కానీ, మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో మర్చిపోయి… తన సొంత పిల్లలని కూడా చూడకుండా గొడ్డలికి పని చెప్పాడు. ముగ్గుర్ని తెగనరికి… ఆ తర్వాత ఓ బావిలో పడేశాడు. ఈ దారుణం odishaలో చోటు చేసుకుంది. సుందర్ గఢ్ జిల్లా కొయిడా జిల్లా కులా గ్రామానికి చెందిన పండు ముండా శనివారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవపడి గొడ్డలితో ఆమెను వెంబడించాడు. ప్రాణ భయంతో ఆమె దాక్కోవడంతో ఇంటికి వచ్చి అభం, శుభం తెలియని తన ముగ్గురు పిల్లల్ని సీమ(5), రాజు (2), ఆరు నెలల చిన్నారిని గొడ్డలితో నరికి చంపాడు.
ఆ తర్వాత deadbodyలను బావిలో పడేసి స్థానికంగా ఉండే అడవిలోకి పారిపోయాడు. ఆదివారం ఉదయం తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి వారు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. చివరికి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కొన్ని గంటల వ్యవధిలో ఈ దారుణానికి పాల్పడిన పండు ముండాను అదుపులోకి తీసుకున్నారు.