క్యాన్సర్‌ కబళిస్తున్నా...డ్యూటీయే ముఖ్యం

By sivanagaprasad kodatiFirst Published Oct 17, 2018, 1:29 PM IST
Highlights

కొందరు పోలీస్ ఉన్నతాధికారులు లంచాలు తీసుకోవడమో లేదంటే.. మహిళలను వేధించడమో చేసి డిపార్ట్‌మెంట్‌కు చెడ్డ పేరు తెస్తుంటే.. ప్రాణాంతక వ్యాధి తనను కబళిస్తున్నా ప్రతిరోజు డ్యూటీకి హాజరవుతున్నారు ఈ సీనియర్ పోలీస్.

మధ్యప్రదేశ్ బడ్వానీ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న మోహన్ తివారీ నోటీ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వైద్యులు సూచించిన సలహా ప్రకారం ఆయన విశ్రాంతి తీసుకోవాలి కానీ..డ్యూటీ అంటే ప్రాణం పెట్టే మోహన్ ఇంట్లో ఉండటానికి ఇష్టపడలేదు. దీంతో చికిత్స తీసుకుంటూనే డ్యూటీకి హాజరవుతున్నారు..

ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు.. ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంతో మోహన్‌కు మరో రెండేళ్లు పనిచేసే అవకాశం దక్కినందుకు ఆయన ఎంతగానో సంతోషపడుతున్నారు. చివరి శ్వాస వరకు తాను విధులు నిర్వహిస్తూనే ఉంటానని మోహన్ గర్వంగా చెప్పారు. ఇటువంటి నిజాయితీ కలిగిన అధికారులు కొత్తగా విధుల్లోకి చేరే వారికి స్ఫూర్తిదాతలు.
 
click me!