
దసరా ఉత్సవాల నేపథ్యంలో.. మద్యం ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. బెంగళూరులోని జె.సి.నగర్ ఉప విభాగం పరిధిలో దసరా ఉత్సవాలు భారీగా జరుగుతున్న తరుణంలో ఈనెల 19న మద్యం విక్రయాలపై నిషేధం విధించారు.
దసరా మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 100కుపైగా పల్లకీల ఊరేగింపు సాగే కె.జి.హళ్ళి, శివాజీనగర్, జె.సి.నగర్, ఆర్.టి.నగర్, సంజయ్‌నగర్, హెబ్బాళ, భారతీనగ్, పులకేశినగర్, డి.జె.హళ్ళి ప్రాంతాల్లో 19న ఉదయం 6 గంటలనుంచి అమల్లోకి వచ్చే మద్యం విక్రయాల నిషేధం 20న ఉదయం 6 గంటలవరకు కొనసాగుతుందని నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ ప్రకటించారు.
ఈ ప్రాంతాల్లోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోనూ పోలీసులు మద్యం విక్రయాలపై నిఘా విధించనున్నారు. శాంతిభద్రతలు కాపాడే దిశలో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రజలు సహకరించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.