ఇండియా కూటమి బాయ్‌కాట్ చేసిన జర్నలిస్టుతో కాంగ్రెస్ లీడర్ కమల్‌నాథ్ ఇంటర్వ్యూ

By Mahesh K  |  First Published Nov 5, 2023, 6:03 PM IST

ఇండియా కూటమి బాయ్‌కాట్ చేసిన జర్నలిస్టుకు మధ్యప్రదేశ్  కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిపై మిత్రపార్టీలు తీవ్ర విమర్శలు కురిపించాయి.
 


న్యూఢిల్లీ: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టుకున్నాయి. ఈ కూటమి సమావేశాల్లో పార్టీలన్నీ కొన్ని తీర్మానాలు చేసుకున్నాయి. అందులో భాగంగా కొందరు జర్నలిస్టులను జాబితాగా మలిచి, వారి ఈవెంట్‌లకు అటెండ్ కావొద్దని, అలాగే, వారిని ఏదేని కార్యక్రమానికి ఆహ్వానించవద్దని నిర్ణయించుకున్నాయి. వారంతా బీజేపీ ఎజెండాతో నడుచుకుంటారని, వారిని బాయ్‌కాట్ చేయాలని ఏకగ్రీవంగా విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.

అయితే.. ఈ నిర్ణయాన్ని కూటమికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతనే ఉల్లంఘించారు. ఇండియా కూటమి బాయ్‌కాట్ 14 మంది పాత్రికేయుల జాబితాలో ఉన్న జర్నలిస్టు, టైమ్స్ నౌ నవభారత్ ఎడిటర్ ఇన్ చీఫ్ నవికా కుమార్‌కు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. నవికా కుమార్‌కు కమల్ నాథ్ ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని మిత్రపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.

Latest Videos

ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరక మిత్రపార్టీలే పరస్పరం విమర్శలు చేసుకునే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సీట్లను కేటాయించకపోవడంతో సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌లు కాంగ్రెస్ అభ్యర్థులపై తమ అభ్యర్థులనూ బరిలోకి దించాయి. ఇదే తరుణంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల కోసం క్యాంపెయిన్ చేస్తున్న కమల్ నాథ్ ఆయన వెంట జర్నలిస్టు నవికా కుమార్ ప్రయాణించడానికి అనుమతించి, ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని కూటమిలోని ఇతర పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.

Also Read: కాంగ్రెస్‌లో గందరగోళం.. టికెట్ ఒకరికి, నామినేషన్ వేసింది మరొకరు

సమాజ్‌వాదీ పార్టీ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడింది. ఇండియా కూటమి బాయ్ కాట్ చేసిన జర్నలిస్టును వెంటపెట్టుకుని తిరుగుతున్న కాంగ్రెస్ బీజేపీ ఎఝెండా మీద నడుస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇండియా కూటమి పార్టీలతో స్వయంగా కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా నడుచుకోవడం లేదని విరుచుకుపడింది.

ఇండియా కూటమిలో భాగమైన నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా కూడా ఎక్స్‌లో కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. కాగా, కాంగ్రెస్‌కు మాత్రం ఇందులో ఏ తప్పూ కనిపించకపోవడం గమనార్హం.

click me!