కరోనా నుండి కోలుకొన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్: ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

By narsimha lode  |  First Published Aug 5, 2020, 6:32 PM IST

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం నాడు కరోనా నుండి కోలుకొన్నారు. దీంతో ఆయనను వైద్యులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. జూలై 25వ తేదీన ఆయన కరోనా బారిన పడ్డారు.


భోపాల్:మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం నాడు కరోనా నుండి కోలుకొన్నారు. దీంతో ఆయనను వైద్యులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. జూలై 25వ తేదీన ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన భోపాల్ లోని ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో కరోనాకు ఆయన చికిత్స తీసుకొన్నారు. 

also read:నా బట్టలు నేనే ఉతుక్కొంటున్నా: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

Latest Videos

undefined

ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న ఆయనకు పరీక్షలు నిర్వహిస్తే  నెగిటివ్ వచ్చింది. మరో వారం రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్ లోనే ఉండాలని  వైద్యులు సూచించారు.ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సందర్భంగా ముఖ్యమంత్రి చౌహాన్ వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రిలో కరోనా రోగులకు వైద్యులు అందిస్తున్న సేవలను ఆయన గుర్తు చేసుకొంటూ కొనియాడారు.

కరోనా ప్రమాదకారి కాదన్నారు. అయితే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం తెచ్చే వైరస్ అని ఆయన అభిప్రాయపడ్డారు. లక్షణాలు కన్పించిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. రోనా బారిన పడిన మొదటి సఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఇటీవలనే కర్ణాకట సీఎం యడియూరప్ప కూడ కరోనా బారినపడ్డారు. 

 

click me!